Easy Cleaning Tips for Gold Jewellery :బంగారం అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ మహిళలకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. బంగారు ఆభరణాలకు కొన్న కొత్తలో ఉండే మెరుపు.. వాడే కొద్దీ ఉండదు. ఉపయోగిస్తున్న కొద్దీ సహజ మెరుపును కోల్పోతాయి. దీంతో.. చాలా మంది మెరుగు పెట్టించేందుకు గోల్డ్ షాప్‌లకు వెళ్తుంటారు. అయితే.. ఇకపై మీరు అలా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దే ఈజీగా ఈ టిప్స్‌తో మీ బంగారు నగలను కొత్తవాటిలా మెరిసేలా చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు బంగారు ఆభరణాలను ఇంటి వద్దనే క్లీన్ చేసుకోవడానికి సులభమైన పద్ధతి.. సోప్ వాటర్ - బ్రషింగ్. ఈ విధానం గోల్డ్ జ్యూవెలరీ మురికిని పోగొట్టడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. మరి.. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎంత సంపాదించినా రూపాయి మిగలట్లేదా? - ఈ వాస్తు దోషాలే కారణం!
- ముందుగా మీరు ఒక శుభ్రమైన బౌల్లో సంగం నిండే వరకు గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి.
- ఆ తర్వాత దానికి తేలికపాటి డిజర్జెంట్లు లేదా కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ సొల్యూషన్‌ను ఆ వాటర్‌లో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇప్పుడు శుభ్రపర్చాలనుకుంటున్న బంగారు ఆభరణాలను ఆ ద్రావణంలో 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాలి.
- మృదువైన టూత్ బ్రష్ లేదా సాఫ్ట్ బ్రష్ తీసుకొని ముక్కులు, క్రేనీల నుంచి మురికిని తొలగించడానికి నెమ్మదిగా బ్రషింగ్ చేయాలి.
- ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఎప్పుడూ నగలను గట్టిగా స్క్రబ్ చేయకూడదు.
- ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత నగలను ఒక మంచి మృదువైన టవల్ తీసుకుని తుడవాలి.
- ఆ తర్వాత వాటిని కాసేపు గాలికి ఆరబెట్టాలి. అంతే మీ బంగారు ఆభరాలకు పట్టిన మురికి పోయి కొత్తగా మెరుస్తాయి.
- ఈ సోప్ వాటర్ బ్రషింగ్ విధానాన్ని.. పసుపు, తెలుపు, గులాబీ బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు.
- అయితే.. మీరు ఇక్కడ పంపు నీటికి బదులుగా సోడియం లేని సెల్ట్జర్ నీరు లేదా క్లబ్ సోడాను కూడా యూజ్ చేయొచ్చని సూచిస్తున్నారు.
- దీని ద్వారా కూడా మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఈ కార్బొనేటేడ్ ద్రవాల వల్ల ఆభరణాలలో పేరుకుపోయిన మురికి పూర్తిగా వదులుతుందని చెబుతున్నారు.
గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు :మీరు రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి ఈ విధానాన్ని అనుసరించకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటిని సబ్బు నీటిలో నానబెట్టడం వలన నీరు పేరుకుపోతుంది. కాలక్రమేణా అది తుప్పు పట్టడానికి లేదా రంగు మారడానికి కారణమవుతుందని చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి ఆభరణాలను ప్రొఫెనల్స్తోనే క్లీన్ చేయించడం మంచిది. అలాగే ఈ నగలను ఎలా పడితే అలా స్టోర్ చేయకుండా వీటి కోసం ప్రత్యేకించిన బాక్స్‌లలోనే ఉంచేలా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
డబ్బు సంపాదించడానికి - ధనవంతులు అనుసరించే 10 మార్గాలు ఇవే!