How To Apply Ganji To Clothes : చాలా మందికి బట్టలకు గంజి పెట్టుకొని వేసుకొనే అలవాటు ఉంటుంది. అందులో ముఖ్యంగా కాటన్ చీరలు, టవల్స్‌తో పాటు ఇతర కాటన్ దుస్తులకైతే తప్పనిసరిగా గంజి లేదా స్టార్చ్ యూజ్ చేస్తుంటారు. అలా చేయడం ద్వారా అవి స్టిఫ్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తాయి. కానీ, ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి ఇళ్లలో బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వాషింగ్ మెషీన్లో దుస్తులు వాష్ చేశాక మళ్లీ నీళ్లలో నానబెట్టి బట్టలకు గంజి పెడుతుంటారు. కానీ, అలాకాకుండా వాషింగ్ మెషీన్‌లోనే బట్టలకు గంజి లేదా స్టార్చ్ పెట్టుకోవచ్చని మీకు తెలుసా? అది కూడా చాలా సింపుల్. ఇంతకీ, వాషింగ్ మెషీన్లో దుస్తులకు గంజి ఎలా పెట్టాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాషింగ్ మెషీన్లో బట్టలకు గంజి ఎలా పెట్టాలంటే?
- ఇందుకోసం మీరు ముందుగా గంజి పెట్టాలనుకుంటున్న దుస్తులను వాషింగ్ కోసం మెషీన్లో వేసుకోవాలి. ఆపై మీరు డైలీ ఎలా వాష్ చేసుకుంటారో ఆ విధంగా నార్మల్‌గా దుస్తులను వాష్ చేసుకోవాలి.
- బట్టలను వాష్ చేసుకోవడం అయిపోయాక.. చివర్లో మళ్లీ ఫైనల్ రిన్స్ సైకిల్ లేదా రిన్స్ సైకిల్ బటన్‌ను ప్రెస్ చేయాలి. లేదంటే మాత్రం బట్టలు వాష్ అవుతున్నప్పుడే మధ్యలో ఫైనల్ రిన్స్ సైకిల్ ముందు పాజ్ చేసి అప్పుడే గంజి వేసుకోవచ్చు.
- అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మీరు లిక్విడ్ స్టార్చ్ యూజ్ చేస్తే ముందుగా ఒకసారి బాటిల్‌ను బాగా షేక్ చేసి ఆపై అవసరమైనంత స్టార్చ్‌ను వాడుకోవాలి
- అదే ఒకవేళ.. మీరు పౌడర్ రూపంలో స్టార్చ్ యూజ్ చేస్తున్నట్లయితే 1 లేదా 2 చెంచాల స్టార్చ్ పౌడర్‌ను 1 కప్పు నీళ్లలో బాగా కలిసేలా మిక్స్ చేసుకొని ఉపయోగించాలి.
- అలాకాకుండా.. స్టార్చ్ పౌడర్‌ను నేరుగా బట్టల్లో వేయకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్క పౌడరే కాదు గంజి, స్టార్చ్ లిక్విడ్ కూడా డైరెక్ట్‌గా దుస్తులపై వేయకూడదు.
- మీరు ఏది యూజ్ చేస్తున్నా.. వాషింగ్ మెషీన్లో డిటర్జెంట్ లేదా ఫ్యాబ్రిక్ సాఫెనర్ కోసం ఉన్న డ్రా లేదా స్పేస్ బాక్స్‌లో పోసుకోవాలి.
- ఆ విధంగా పోసుకున్నాక చివరగా మరోసారి ఫైనల్ రిన్స్ సైకిల్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు సైకిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక బట్టలను తీసి బయట ఆరేసుకోవాలి.
- అయితే, బట్టలను ఆరేసుకునేటప్పుడే ముడతలు లేకుండా దులిపి ఆరబెట్టుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా ముడతలు ఉంటే పోతాయి.
- ఇక చివరగా.. బట్టలు ఆరిన తర్వాత ఐరన్ చేసుకొని మడత పెట్టుకుంటే చాలు. మీ గంజి పెట్టిన దుస్తులు స్టిఫ్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తూ తళతళ మెరిసిపోతాయి!