తెలంగాణ

telangana

హోటల్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ - ప్రిపరేషన్​ వెరీ ఈజీ- పల్లీ చట్నీతో తింటే టేస్ట్ వేరే లెవల్! - Hotel Style Crispy Rava Dosa Recipe

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 5:20 PM IST

Hotel Style Crispy Rava Dosa Recipe :దోశ.. బ్రేక్​ఫాస్ట్​లో ఎక్కువ మంది ఇష్టపడే టిఫెన్స్​లో ఇదీ ఒకటి. అయితే, చాలా మంది డైలీ ఇంట్లో ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ వంటివి తింటుంటారు. మరికొందరు హోటల్​కి వెళ్లినప్పుడు రవ్వ దోశ, ఎగ్ దోశ వంటివి టేస్ట్ చేస్తుంటారు. అయితే ఇకపై రవ్వ దోశ కోసం హోటల్​కు వెళ్లే అవసరం లేకుండా.. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! టేస్ట్ అద్దిరిపోతుంది!

How To Make Hotel Style Crispy Rava Dosa
Hotel Style Crispy Rava Dosa Recipe (ETV Bharat)

How To Make Hotel Style Crispy Rava Dosa :మనలో ఎక్కువ మందికి టిఫెన్లలో మొదటగా గుర్తొచ్చేది.. దోశ. చాలా మందికి ఇది ఫేవరెట్​ బ్రేక్​ఫాస్ట్​ కూడా. పేరు వింటేనే నోట్లో నీళ్లూరిపోయే ఈ సౌత్‌ ఇండియన్‌ స్పెషల్‌ టిఫెన్‌కి.. బయట టిఫిన్​ సెంటర్లు, హోటల్స్​లోనూ మంచి గిరాకీ ఉంటుంది. అంతేకాదు.. హోటల్స్​లో రకరకాల వెరైటీ దోశలు అందుబాటులో ఉంటాయి. అందులో.. రవ్వ దోశ ఒకటి. హోటల్స్​లో రవ్వ దోశ టేస్ట్ సూపర్​గా ఉంటుంది. అలాగని ప్రతిరోజూ బయటకు వెళ్లి తినలేం కదా! అందుకే.. మీకోసం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా హోటల్ స్టైల్ రవ్వ దోశ రెసిపీని తీసుకొచ్చాం. క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ దోశ(Dosa) రుచి సూపర్​గా ఉంటుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - కప్పు
  • బియ్యప్పిండి - కప్పు
  • మైదా - అర కప్పు
  • పెరుగు - అర కప్పు
  • జీలకర్ర - టీస్పూను
  • మిరియాల పొడి - ఒక చెంచా
  • ఉప్పు - తగినంత
  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 2 టేబుల్‌స్పూన్లు
  • పచ్చిమిర్చి తురుము - 2 టీస్పూన్లు
  • అల్లంతురుము - టీస్పూను
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
  • నూనె - కొద్దిగా
  • నీళ్లు - సరిపడా

సొరకాయ దోశ ట్రై చేశారా?- బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్!

రవ్వ దోశ తయారీ విధానం :

  • ముందుగా ఒక బౌల్​లో పైన చెప్పిన విధంగా బొంబాయి రవ్వ, బియ్యప్పిండి, మైదా, పెరుగు, జీలకర్ర, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
  • అనంతరం సన్నగా తరిగిన ఉల్లిముక్కలు, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తురుము, అల్లంతురుము కూడా అదే మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకోవాలి.
  • ఇలా అన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి మిశ్రమాన్ని పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఆపై దాన్ని ఓ అరగంట పక్కన పెట్టుసుకోవాలి.
  • ఆ తర్వాత.. స్టౌ మీద దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయ్యాక.. కాస్త ఆయిల్ వేసి పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • అప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న దోశ పిండి మిశ్రమాన్ని పెనంపై దోశలా పోసుకోవాలి. ఆపై కాస్త నూనె చల్లుకొని గోధుమరంగు వచ్చేంత వరకు ఒకవైపు కాల్చుకోవాలి. అలాగే రెండోవైపు మామూలుగా కాల్చుకోవాలి.
  • అలా కాల్చుకున్నాక పల్చటి అట్లకాడతో దోశ ఏమాత్రం ముక్కలు కాకుండా జాగ్రత్తగా ప్లేట్​లోకి తీసుకోవాలి. అంతే.. క్రిస్పీ, క్రిస్పీగా ఉండే నోరూరించే హోటల్ స్టైల్ దోశ రెడీ! ఆపై దాన్ని పల్లీ చట్నీతో హ్యాపీగా తినొచ్చు.

బ్రేక్​ఫాస్ట్​గా రోజూ దోశ తినొచ్చా? తింటే ఏం అవుతుంది? డాక్టర్ల సమాధానమిదే!

ABOUT THE AUTHOR

...view details