తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశి వారి ఆరోగ్యం నేడు బ్రహ్మాండంగా! మిగతా వారికి ఇలా!! - Daily Horoscope In Telugu - DAILY HOROSCOPE IN TELUGU

Horoscope Today August 31st 2024 : ఆగస్టు​ 31వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 3:47 AM IST

Horoscope Today August 31st 2024 : ఆగస్టు​ 31వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారులకు రుణభారం పెరుగుతుంది. ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. కొన్ని వ్యవహారాలలో బంధువుల ప్రవర్తనకు కలత చెందుతారు. కుటుంబ కలహాలు అశాంతి కలిగించడంతో భావోద్వేగానికి గురవుతారు. మనో నిబ్బరంతో ఉండడానికి ప్రయత్నించండి. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్ధిక లాభాలు ఉంటాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపారంలో పోటీ, సవాళ్లు ఉన్నప్పటికినీ అధిగమిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్ధికంగా పురోగతి సాధిస్తారు. మరిన్ని శుభ ఫలితాల కోసం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించడం ఉత్తమం.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కష్టించి పనిచేసి లక్ష్యాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఓ శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. లాభాలు వృద్ధి చెందుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో కీలకమైన ఘటనలు జరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగులు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆర్ధిక వ్యవహారాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందుచూపుతో అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్ యరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభఘడియలు సమీపించాయి. ఈ రోజు వ్యక్తిగతంగా, వృత్తి పరంగా గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. విశేషమైన సంపద ప్రాపిస్తుంది. వ్యాపారస్తులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో ఊహించని ధన లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు తమ శక్తియుక్తులతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్‌ అందుకుంటారు. ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకోని మలుపులు జరుగుతాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తిపరమైన విషయాల్లో క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఊహించని సంఘటన కారణంగా తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతారు. మీరంటే గిట్టని వాళ్లు వృత్తి పరంగా మీకు హాని తలపెట్టే ప్రమాదముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శివారాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. వృత్తిలో ఎదురయ్యే సమస్యల కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. మానసికంగా, శారీరకంగా అలసటకు గురి కావడం వల్ల పనుల్లో ఆలస్యం చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో కష్టనష్టాల కారణంగా చికాకు కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అదనపు ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు, కమిషన్ వ్యాపారాలు మంచి లాభాలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిని ఈ రోజు విజయం, కీర్తి, వరిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగులు తోటి ఉద్యోగుల సహకారంతో అన్ని పనులు వియజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అవకాశవాదులు పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని ముఖ్యమైన ఖర్చులు ఉండవచ్చు. అవసరానికి ధనం అందుతుంది. శ్రీ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా రచయితలు, సాహితీవేత్తలు సన్మాన సత్కారాలను అందుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపును పొందుతారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. వ్యాపారంలో లాభాలు మెండుగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి జీతంతో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. ఇష్ట దేవతారాధన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details