Hathras Stampede Incident : ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట మృతుల సంఖ్య 121కు చేరుకుంది. మరో 28 మంది క్షతగాత్రలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, హాథ్రాస్‌లో సత్సంగ్ నిర్వహించినవారిపై పోలీసులు ఎఫ్ఐఐర్ నమోదు చేశారు. సత్సంగ్ ముఖ్య నిర్వహకుడు దేవ ప్రకాశ్ మధుకర్, సికందరరావు తదితరులపై కేసు నమోదైంది.
పరారీలో 'భోలే బాబా'
హాథ్రస్‌లో సత్సంగ్ నిర్వహించిన మత బోధకుడు నారాయణ్ సాకర్ హరి అలియాస్ 'భోలే బాబా'ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం భోలే బాబా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మెయిన్‌పురిలో భోలే బాబాకు చెందిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో సోదాలు నిర్వహించగా అక్కడా ఆయన కనిపించలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ కుమార్ తెలిపారు.
సుప్రీం కోర్టులో పిటిషన్
హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అటు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.
ఎఫ్ఐఆర్ నమోదు
మరోవైపు హాథ్రస్‌లో సత్సంగ్ జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ ఆధారాలను అధికారులు సేకరించారు. డాగ్ స్క్వాడ్‌ను తీసుకొచ్చి తొక్కిసలాట జరిగిన ప్రదేశం చుట్టుపక్కల గాలించారు. ఈ ఘటను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పోలీసులు సికిందరరావు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు. సత్సంగ్ నిర్వహించిన ముఖ్య సేవాదార్ దేవప్రకాశ్, ఇతర నిర్వాహకులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిర్వాహకులు అనుతులను నిబంధనలు ఉల్లఘించినట్లు పేర్కొన్నారు. 80 వేల మందికి అనుమతిస్తే 2.5లక్షల మంది హాజరైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
విచారణ వ్యక్తం చేసిన బిహార్ డిప్యూటీ సీఎం
హాథ్రస్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరీ తెలిపారు. ఈ ఘటనపై యూపీ సర్కార్ విచారణ చేపడుతోందని పేర్కొన్నారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మరోవైపు, సత్సంగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ప్రజలకు సరైన భద్రత కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ కేఎల్ శర్మ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హాథ్రస్ తొక్కిసలాటలో మహిళలే ఎక్కువ మంది చనిపోవడం బాధ కలిగించిందని అన్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో టు బాబా అవతారం- ఎవరీ 'భోలే బాబా'? హాథ్రస్ తొక్కిసలాటకు కారణమేంటి? - Hathras stampede
'వికసిత్ భారత్ లక్ష్యంగా డే&నైట్ పనిచేస్తా- సానుభూతి కోసం 'బాలక్ బుద్ధి' రాహుల్ కొత్త డ్రామా' - PM Modi Seech In Parliament