Gujarat Earthquake :గుజరాత్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. అమ్రేలి జిల్లాలోని సావర్ కుండ్లా, మితియాలా, ధజాడి, సకర్పరా తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం 5.20 గంటల సమయంలో భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి ఆరుబయటకు పరుగులు తీశారు. కాగా, రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు గాంధీనగర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ విభాగం తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
గుజరాత్‌లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 3.7తీవ్రత నమోదు
గుజరాత్‌లో భూకంపం- రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రత నమోదు
Published : Oct 27, 2024, 8:16 PM IST
|Updated : Oct 27, 2024, 8:33 PM IST
కాగా, భూకంపం కారణంగా అమ్రేలిలోని తటానియా గ్రామంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో స్థానికంగా ఉన్న ఓ జ్యువెలరీ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పనిలో నిమగ్నమైన సమయంలో భూమి కంపించడం వల్ల వాళ్లంత భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు! అమ్రేలి జిల్లాలోని ధరి, గిర్ పంథక్, ఖంభా గిర్ పంథక్, లాథి, లిలియా, సావర్ కుండ్ల ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో పరిసార ప్రాంతాల ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు.