Four Persons Gang Rape of Mother in law and Daughter in Law : పండుగ వేళ శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని కత్తులతో బెదిరించి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉపాధి కోసం ఓ కుటుంబం ఐదు నెలల క్రితం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి వచ్చి శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే విధులు ముంగించుకొని నిన్న(శుక్రవారం)రాత్రి నిద్రకు ఉపక్రమించారు.
కత్తులతో బెదిరించి అత్యాచారం: ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మూడు గంటల సమయంలో నలుగురు దుండగులు రెండు బైక్‌లపై వచ్చి పేపర్ మిల్లు ఉన్న ప్రాంతంలో తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన ఇంట్లో పెద్దాయన బయటకు వచ్చి టార్చ్ లైట్ వేసి అక్కడ ఉన్న నలుగురిని ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు తీరుగుతున్నారని నిలదీశారు. దీంతో దుండగుల్లో ఒకరు పెద్దాయనపై దాడిచేశాడు. వెంటలో లోపల ఉన్న కుమారుడు బయటకు వచ్చి ఆపే ప్రయత్నం చేయగా వెంటనే మిగతా ముగ్గురు నిందితులు వచ్చి దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇంటి లోపల ఇద్దరు మహిళలు ఉన్నారని గుర్తించిన నలుగురు దుండగులు వెంటనే గదిలోకి చొరబడి ఆ మహిళలను కత్తులతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది అఘాయిత్యం - అర్ధరాత్రి యువతి ఇంటికెళ్లి చాకుతో దాడి