Election Duty Exemptions For Employees : ఎన్నికల నిర్వహణ అంటే మహా యజ్ఞం. ప్రజాస్వామ్యానికి పండుగ లాంటి ఈ గొప్ప క్రతువులో భారీ సంఖ్యలో పాల్గొనే ఎన్నికల సిబ్బంది సేవల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, జాతీయ బ్యాంకులు, ఎల్‌ఐసీ సహా వివిధ సంస్థల ఉద్యోగులకు ఎన్నికల విధులను కేటాయిస్తుంటారు. విద్యార్హతలు, అవగాహనా పరిధి, అనుభవం, పనిచేసే విభాగం స్వభావం ఆధారంగా వీరికి ఎన్నికల వేళ వివిధ రకాల బాధ్యతలను ఎన్నికల సంఘం అప్పగిస్తుంటుంది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, సెక్టార్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, అసిస్టెంట్ వ్యయ పరిశీలకులు, డ్రైవర్లు, కండక్టర్లు, వాహనాల క్లీనర్ల వంటి వివిధ బాధ్యతలను ప్రభుత్వ సిబ్బందికి అప్పగిస్తుంటారు. తమకు ఇంఛార్జిగా ఉండే అధికారితో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వీరు విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి పొరపాటు చేసినా అధికారాన్ని దుర్వినియోగం చేసినా నేరుగా రాష్ట్ర ఎన్నికల సంఘమే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఎన్నికల విధులకు హాజరు కావాల్సిందే. ఈ ఎన్నికల విధుల్లో నియమితులైనవారు గైర్హాజరయ్యేందుకు అవకాశం ఉండడు. ఒకవేళ విధులకు హాజరు కాకపోతే ఎన్నికల సంఘం కఠినమైన చర్యులు తీసుకుటుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో విధులకు గైర్హాజరయ్యేందుకు మినహాయింపులు ఉంటాయి. అది కూడా కేవలం నాలుగు పరిస్థితుల్లో మాత్రమే. అయితే ఆ కారణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఉద్యోగులు వారివారి జిల్లా ఎన్నికల అధికారుల(డీఈఓ)కు సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి ఆయన ఆమోదిస్తేనే ఈ విధుల నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇంతకీ ఆ నాలుగు మినహాయింపుల ఏంటో చూద్దాం.
విదేశాలకు వెళ్లే వారికి
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్లటం కోసం ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకొని ఉంటే ఎన్నికల డ్యూటీ మినహయింపు కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ప్రయాణానికి సంబంధింత టికెట్లు, వీసాను తప్పక సమర్పించాలి. అయితే విదేశాలకు వెళ్లే సమయం, పోలింగ్ తేదీలు ఒకటే ఉండాలి. అప్పుడు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
తీవ్రమమై వ్యాధులతో బాధపడుతున్నప్పుడు
తీవ్ర గుండె జబ్బు లేదా ఏదైనా అరుదైన వ్యాధితో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్నికల డ్యూటీ నుంచి మినహాయింపు కల్పిస్తారు. అందుకోసం వైద్య ఆధారాలు, వైద్యుల ధ్రువీకరణలు, మెడికల్ టెస్టు రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. ఆరోగ్య స్థితిగతుల నేపథ్యంలో ఇలాంటి వారికి విధుల నుంచి మినహాయింపు ఇస్తుంటారు.