తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎగ్ లేకుండా అద్దిరిపోయే "ప్యూర్ వెజ్ బ్రెడ్​ ఆమ్లెట్" - నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు! - టేస్ట్ అద్భుతం! - How To Make Veg Bread Omelette - HOW TO MAKE VEG BREAD OMELETTE

Pure Veg Omelette Recipe : చాలా మందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టం. కానీ ఎగ్​తో తినాలంటే కొద్దిమందికి కష్టం. అలాంటి వారు ఎగ్ లేకుండా టేస్టీ బ్రెడ్​ ఆమ్లెట్​ చేసుకుంటే.. ఏంటి నమ్మలేకున్నారా? అందుకే మీకోసం చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకునేలా రెసిపీ తీసుకొచ్చాం. అదే.. ప్యూర్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్. రుచి కూడా ఎగ్​తో ప్రిపేర్ చేసుకునే దానికంటే సూపర్​గా ఉంటుంది!

EGGLESS BREAD OMELETTE
Pure Veg Omelette Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 5:16 PM IST

How To Make Pure Veg Bread Omelette in Telugu :బ్రెడ్ ఆమ్లెట్.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది మార్నింగ్ చేసుకునే బ్రేక్​ఫాస్ట్ ఐటమ్స్​లో ఒకటి. ముఖ్యంగా పిల్లలకు స్కూల్ టైమ్ అవుతుందనో, ఆఫీస్​కి లేట్ అవుతుందనో.. ఇలా సందర్భమేదైనప్పటికీ వేగంగా అవుతుందని ఎక్కువ మంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే, మెజార్టీ పీపుల్​కు బ్రెడ్ ఆమ్లెట్ అనగానే.. ఎగ్​తో ప్రిపేర్ చేసుకోవడమే గుర్తుకొస్తోంది. కానీ, గుడ్డు(Egg)లేకుండా కూడా బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అది కూడా 100 శాతం ప్యూర్ వెజ్​తో అద్దిరిపోయే రుచిలో బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసుకోవచ్చు. పైగా ఈ రెసిపీ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు! చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ, వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - ఒకటిన్నర కప్పు
  • బియ్యపిండి - అర కప్పు
  • చాట్ మసాలా - అర టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీస్పూన్
  • మిరియాల పొడి - పావు టీస్పూన్
  • బేకింగ్ పౌడర్ - 1 టేబుల్​స్పూన్
  • టమాట తరుగు - 3 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - 3 టేబుల్​స్పూన్లు
  • నెయ్యి/నూనె - తగినంత
  • బ్రెడ్ స్లైసెస్ - 4 లేదా 5

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో శనగపిండి, బియ్యపిండి, చాట్ మసాలా తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అయితే, ఇక్కడ.. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఒకటి కాదనే విషయం గమనించాలి.
  • తర్వాత ఆ మిశ్రమంలో తగినన్ని వాటర్ పోసుకుంటూ 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి.
  • ఆవిధంగా మిక్స్ చేసుకున్నాక.. అందులో గింజలు తొలగించి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని పదినిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి/నూనె వేసుకోవాలి. అది కరిగాక దానిపై ఒక శాండ్​విచ్ బ్రెడ్ స్లైస్ ఉంచి బాగా కాల్చుకోవాలి. ఆపై.. రెండోవైపు కూడా బ్రెడ్​పై కొద్దిగా నెయ్యి/నూనె వేసుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇదే మాదిరిగా మిగతా బ్రెడ్ స్లైస్​లను కాల్చుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం మరోసారి స్టౌపై పాన్ పెట్టుకొని ఒక టీస్పూన్ నెయ్యి వేసుకోవాలి. అది కరిగాక దానిపై ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా పోసుకుని పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా గరిటెతో రుద్దుకోవాలి. అయితే, మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా కాస్త మందంగానే ఉండేలా చూసుకోవాలి.
  • ఆ తర్వాత అంచుల వెంట అక్కడక్కడ కొద్దిగా బటర్ లేదా నెయ్యి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి నిదానంగా రోస్ట్ చేసుకోవాలి.
  • అనంతరం పిండి మధ్యలో కాస్త తడిగా ఉన్నప్పుడు.. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఒక బ్రెడ్ స్లైస్​ను​ ఉంచి అంచులను నాలుగు పక్కల లోపలికి మడతేసుకోవాలి.
  • ఆవిధంగా చేసుకోవడం వల్ల తడిపొడిగా ఉన్న పిండి బ్రెడ్​ను అంటిపట్టుకొని ఉంటుంది. తర్వాత రెండువైపులా కాస్త నెయ్యి లేదా బటర్ వేసుకొని కాల్చుకోవాలి.
  • ఇదేవిధంగా మిగతా పిండి, బ్రెడ్ స్లైస్​లను రోస్ట్ చేసుకొని ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే 'ప్యూర్ వెజ్ బ్రెడ్ ఆమ్లెట్' రెడీ!

ABOUT THE AUTHOR

...view details