తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చద్దన్నం మాకొద్దు అంటున్నారా? - ఇలా ఎగ్​ పులావ్ చేయండి ఎగబడి తింటారు!

Egg Pulao Recipe With Leftover Rice : ఏదో ఒక కారణంతో.. తరచూ రాత్రి అన్నం మిగిలిపోతుంది. ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేదే. ఉదయాన్నే తినమంటే.. చద్దన్నం ఎవరు తింటారంటూ అందరూ ముఖం చిట్లిస్తారు. అయితే.. మిగిలిపోయిన అన్నంతో మీరు ఇలా ఎగ్ పులావ్ చేశారంటే.. వదలకుండా లాగించేస్తారు!

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 4:27 PM IST

Egg Pulao
Egg Pulao Recipe With Leftover Rice

Egg Pulao Recipe With Leftover Rice :పలు కారణాలతో రాత్రివేళ అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఉదయాన్నే దాన్ని తినాలంటే ఇంట్లో వారంతా నో అంటారు. ఇక పిల్లలైతే చెప్పాల్సిన పనేలేదు. అస్సలే ముట్టుకోరు. దాంతో.. మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలో తెలియక గృహిణులు తామే తినేస్తుంటారు. అయినా మిగిలిపోతే దాన్ని బయట పడేస్తుంటారు. అరే ఇంత రైస్ వేస్ట్ అయిందే అని బాధపడుతుంటారు. ఈ పరిస్థితి రోజూ ఉంటే మరింతగా ఆవేదన చెందుతారు.

ఇలాంటి పరిస్థితిలో మీరు కూడా ఉంటే.. ఇకపై బాధ పడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో.. అదిరిపోయే ఎగ్​ పులావ్ రెసిపీ ప్రిపేర్ చేసుకోండి. అందుకోసం మీరు పెద్దగా శ్రమించాల్సిన పని కూడా లేదు. తక్కువ టైమ్​లో చాలా ఈజీగా ఈ రుచికరమైన పులావ్​ను రెడీ చేసుకోవచ్చు. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నోరూరించే ఎగ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూసేయండి!

ఎగ్​ పులావ్​ కోసం కావల్సిన పదార్థాలు :

  • అన్నం - 1 కప్పు
  • నూనె - సరిపడా
  • బిర్యానీ ఆకు - 1
  • బాయిల్డ్ ఎగ్స్ - 5
  • ఉల్లిపాయ - 1 (సన్నగా కట్​ చేసుకోవాలి)
  • పచ్చిమిర్చి - 3( కట్ చేసినవి)
  • ఉప్పు - రుచికి తగినంత
  • లవంగాలు -4
  • యాలకులు -4
  • జీలకర్ర - అర టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
  • మిరియాల పొడి - పావు టీస్పూన్
  • పసుపు - అర టీస్పూన్
  • కారం - సరిపడా
  • గరం మసాలా - అర టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
  • కొత్తిమీర, పుదీనా తరుగు - రెండు స్పూన్లు

ఎగ్ పులావ్ తయారీ విధానం :

  • ముందుగా మీరు ఒక బౌల్​లో మిగిలిపోయిన అన్నాన్ని పొల్లులుపొల్లులుగా విడగొట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడా నూనె వేసుకోవాలి.
  • అది కాస్త హీట్ అయ్యాక అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించాలి.
  • ఆపై తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో బాయిల్డ్ ఎగ్స్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. వీటిని కట్ చేసి వేసుకున్నా టేస్టీ గానే ఉంటుంది.
  • ఇక ఎగ్స్ వేగాక మీరు బౌల్​లో పొడిపొడిగా చేసుకున్న అన్నాన్ని వేసి పులిహోరలా ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పైన కొత్తిమీర, పుదీనా తరుగు చల్లుకోవాలి.
  • అంతే ఎంతో రుచికరమైన ఎగ్ పులావ్ రెడీ!

ABOUT THE AUTHOR

...view details