తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ స్నాక్స్​ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్​ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు! - Easy Egg Snack Recipes - EASY EGG SNACK RECIPES

Easy Egg Snack Recipes : సమ్మర్​లో పిల్లలకు సాయంత్రం వేళ ఏదైనా కొత్త రకం స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ఎగ్స్​తో మీరు ఇప్పటివరకు ట్రై చేయని రెండు స్నాక్ రెసిపీలు తీసుకొచ్చాం. అవే.. ఎగ్ 65, ఎగ్ కబాబ్స్. వీటిని ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినడం పక్కా! వాటిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Egg Snack Recipes
Easy Egg Snack Recipes

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 3:06 PM IST

Updated : Apr 26, 2024, 3:33 PM IST

Super Snack Recipes With Eggs :సాధారణంగా చాలా మందికి గుడ్డుతో రెసిపీలు అనగానే.. ఎగ్​ కర్రీ, ఆమ్లెట్, ఎగ్ ఫ్రై వంటివి మాత్రమే గుర్తుకొస్తాయి. కాగా, గుడ్డుతో చేసే ఏ వంటకమైనా పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, గుడ్డుతో(Egg) ఎప్పుడూ చేసే రెసిపీలు కాకుండా.. ఈసారి వెరైటీగా ఎగ్​ 65, ఎగ్ కబాబ్స్ ట్రై చేయండి. అసలే.. సమ్మర్ హాలీడేస్.. పిల్లలూ సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్స్ అడుగుతుంటారు. వారికి ఇవి చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా సులభం. మరి, ఇంకెందుకు ఆలస్యం ఇంటి వద్దే ఈజీగా ఎగ్ 65, ఎగ్ కబాబ్స్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

ఎగ్‌ 65కు కావాల్సిన పదార్థాలు :

  • ఉడికించిన గుడ్లు - ఆరు
  • మొక్కజొన్నపిండి - నాలుగు టేబుల్‌స్పూన్లు
  • పచ్చిమిర్చి - మూడు
  • పచ్చిగుడ్డు - ఒకటి
  • చిక్కని పెరుగు - టేబుల్‌స్పూన్
  • చిల్లీసాస్‌ - టేబుల్‌స్పూన్
  • సోయాసాస్‌ - చెంచా
  • క్యాప్సికం ముక్కలు - పావుకప్పు
  • మిరియాలపొడి - అరచెంచా
  • వెల్లుల్లి తరుగు - చెంచా
  • అల్లం తరుగు - చెంచా
  • కారం - రెండు చెంచాలు
  • కరివేపాకు రెబ్బలు - రెండు
  • ఉప్పు - సరిపడా
  • నూనె - వేయించేందుకు తగినంత.

ఎగ్ 65 తయారీ విధానం :

  • ముందుగా ఉడికించిన ఎగ్స్​ను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఒక బౌల్​లో గుడ్డు సొనను తీసుకుని దానిలో మొక్కజొన్నపిండి, చెంచా కారం, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద కళాయి పెట్టుకొని అందులో గుడ్డు ముక్కలు వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. ఆపై కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను ఒక్కొక్కటిగా మొక్కజొన్న మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ మీద మరో కళాయి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం పెరుగు, క్యాప్సికం ముక్కలు, మిగిలిన కారం, సోయాసాస్‌, చిల్లీసాస్‌, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • నిమిషం అయ్యాక ముందుగా వేయించి ప్లేట్​లో ఉంచిన గుడ్డు ముక్కలు కూడా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు మసాలా పట్టిందనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై ప్లేట్​లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలు.. నోరూరించే రుచికరమైన ఎగ్ 65 రెడీ!

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా!

ఎగ్ కబాబ్స్​కు కావాల్సినవి :

  • గుడ్లు - మూడు (ఉడికించి పొడుగాటి ముక్కల్లా కోసుకోవాలి)
  • ఉడికించిన బంగాళాదుంపలు - మూడు
  • పాలు - రెండు టేబుల్‌స్పూన్లు
  • గుడ్డు - ఒకటి
  • పచ్చిమిర్చి- రెండు
  • నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
  • ఉల్లిపాయ - ఒకటి
  • అల్లం తరుగు-చెంచా
  • వెల్లుల్లి తరుగు-చెంచా
  • కరివేపాకు రెబ్బలు - రెండు
  • పసుపు-అరచెంచా
  • మిరియాలపొడి-పావుచెంచా
  • గరంమసాలా-చెంచా
  • కొత్తిమీర తరుగు-రెండు టేబుల్‌స్పూన్లు
  • ఉప్పు-తగినంత
  • బ్రెడ్‌పొడి-ముప్పావుకప్పు
  • నూనె-వేయించేందుకు సరిపడా.

ఎగ్ కబాబ్స్ తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై పాన్ పెట్టి చెంచా నూనె వేసుకొని కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని వేయించుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో మిరియాలపొడి, పసుపు, గరంమసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై బంగాళాదుంప ముక్కలు వేసి ముద్దలా చేసుకోవాలి.
  • నిమిషం తర్వాత కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి దింపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్​లో గుడ్డుసొన తీసుకొని పాలు, చిటికెడు ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు చేతికి నూనె రాసుకుని కొద్దిగా ఆలుగడ్డ ముద్దను తీసుకుని అరచేయంత మందంలో పల్చగా చేసి.. అందులో ఒక గుడ్డు ముక్కను ఉంచి అంచుల్ని జాగ్రత్తగా మూసేయాలి.
  • ఈ విధంగా చేసుకున్న దాన్ని మొదట గుడ్డు సొనలో ఆ తరువాత బ్రెడ్‌పొడిలో అద్ది కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలిననీ వేయించుకోవాలి. అంతే.. టేస్టీ టేస్టీ ఎగ్ కబాబ్స్ రెడీ!

సమ్మర్​లో మీ పిల్లలకు ఈ స్నాక్స్ - టేస్టీ అండ్ హెల్తీ!

Last Updated : Apr 26, 2024, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details