- కల్కాజీలో దిల్లీ సీఎం ఆతిశీ విజయం
- బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై ఆతిశీ విజయం
దిల్లీలో బీజేపీ హవా- ఆప్ సత్యేందర్ జైన్ ఓటమి, ఆతిశీ విజయం - DELHI ELECTION RESULTS 2025
![దిల్లీలో బీజేపీ హవా- ఆప్ సత్యేందర్ జైన్ ఓటమి, ఆతిశీ విజయం Delhi Election Result 2025 Live Updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/1200-675-23498636-thumbnail-16x9-delhi.jpg)
Published : Feb 8, 2025, 7:20 AM IST
|Updated : Feb 8, 2025, 12:58 PM IST
Delhi Election Result 2025 Live Updates :దిల్లీ శాసనసభ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపెవరిదనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈనెల 5న జరిగిన ఎన్నికల ఓట్లను శనివారం లెక్కిస్తున్నారు. ఇందుకోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. 70 స్థానాలున్న దిల్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది.
LIVE FEED
ఆతిశీ గెలుపు
సత్యేందర్ జైన్ ఓటమి
- ఆప్ అగ్రనేతలు ఓటమి
- కేజ్రీవాల్, సిసోదియా, సత్యేందర్ జైన్ ఓటమి
జంగ్‌పురలో ఆప్ అభ్యర్థి మనీశ్ సిసోదియా ఓటమి
మనీశ్ సిసోదియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్ విజయం
9 రౌండ్ల తర్వాత 1,170 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్
- న్యూదిల్లీ స్థానంలో కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్
- కాల్‌కాజీ స్థానంలో 3,231 ఓట్ల వెనుకంజలో దిల్లీ సీఎం ఆతిశీ. ఆమెపై ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి
- షాకూర్‌బస్తీలో 15,754 ఓట్ల వెనుకంజలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్
- గాంధీనగర్‌లో 7,653 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ
- జంగ్‌పురాలో 2,438 ఓట్ల ఆధిక్యంలో మనీశ్ సిసోదియా
- లక్ష్మీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి అభయ్‌వర్మ గెలుపు
- ఆప్ అభ్యర్థి బీబీ త్యాగిపై అభయ్‌వర్మ విజయం
- పత్పర్‌గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి రవీందర్‌సింగ్ నేగీ విజయం
- ఆప్ అభ్యర్థి అవధ్ ఓజాపై రవీందర్‌సింగ్ నేగీ గెలుపు
- కొండ్లీ నుంచి ఆప్ అభ్యర్థి కుల్దీప్‌కుమార్ గెలుపు
- బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై 6,293 ఓట్ల మెజారిటీతో విజయం
- దిల్లీ కంటోన్మెంట్‌లో ఆప్ అభ్యర్థి వీరేందర్‌సింగ్ విజయం
- బీజేపీ అభ్యర్థి భువన్ తన్వర్‌పై వీరేందర్‌సింగ్ గెలుపు
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. మొదటి విజయాన్ని ఆప్ సొంతం చేసుకుంది. కోండ్లీ నియోజకవర్గ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై 6,293 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు భాజపా కూడా ఖాతా తెరిచింది. లక్ష్మీనగర్ నియోజకవర్గ స్థానం నుంచి అభయ్ వర్మ విజయం సాధించారు.
- న్యూదిల్లీ స్థానంలో ఏడు రౌండ్ల తర్వాత వెనుకంజలో కేజ్రీవాల్
- కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ 238 ఓట్ల ఆధిక్యం
- న్యూదిల్లీ స్థానంలో కేజ్రీవాల్- పర్వేశ్ మధ్య విజయం దోబూచులాట
ఆప్‌ను గెలిపించడం మా బాధ్యత కాదు: కాంగ్రెస్
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జోరు, వెనకబడిన ఆప్, ఖాతా తెరవని కాంగ్రెస్
- ఈ నేపథ్యంలో హస్తం పార్టీ స్పందన
వెనుకంజలో కేజ్రీవాల్
- న్యూదిల్లీ స్థానంలో ఆరు రౌండ్ల తర్వాత వెనుకంజలో కేజ్రీవాల్
- కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ 225 ఓట్ల ఆధిక్యం
- న్యూదిల్లీ స్థానంలో కేజ్రీవాల్- పర్వేశ్ మధ్య విజయం దోబూచులాట
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 42 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. దీంతో పార్టీ కార్యాలయం ఎదుట ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. డప్పులు వాయిస్తూ డ్యాన్సులు చేస్తున్నారు.
- న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ ఆధిక్యం
- రెండో రౌండ్ ముగిసేసరికి 254 ఓట్ల మెజార్టీలో కేజ్రీవాల్
- కల్కాజీ స్థానంలో 1,149 ఓట్ల వెనుకంజలో దిల్లీ సీఎం ఆతిశీ
- దిల్లీ సీఎం ఆతిశీపై ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి
- షాకూర్‌బస్తీలో 6,524 ఓట్ల వెనుకంజలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ వెనుకంజ
- గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై ఆప్ అభ్యర్థి ఆధిక్యం
- అర్విందర్ సింగ్ లవ్లీపై 6,448 ఓట్ల ఆధిక్యంలో నవీన్ చౌధరి
న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ ముందంజ
దిల్లీ సీఎం ఆతిశీపై ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి
దిల్లీ ఎన్నికల ఫలితాలు: 46 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
- 24 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న ఆప్
- తొలి రౌండ్లలో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు వెనుకంజ
ముందంజలోకి వచ్చిన మనీశ్ సిసోదియా
- జంగ్‌పురలో ఆధిక్యంలో కొనసాగుతున్న ఆప్ అభ్యర్థి సిసోదియా
- ఆప్ అభ్యర్థులు సోమ్‌నాథ్ భారతి మాల్వియా నగర్‌లో, సౌరభ్ భరద్వాజ్ గ్రేట్ కైలాశ్‌లో, గోపాల్ రాయ్ బాబర్‌పుర్‌లో ముందంజ
- ఇంకా వెనుకంజలోనే కేజ్రీవాల్, ఆతిశీ
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే, ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ 38 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆప్ (AAP) 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక చోటు ముందంజలో కొనసాగుతోంది.
బీజేపీ 38చోట్ల లీడ్
దిల్లీ ఎన్నికల ఫలితాలు- ఆప్ 24, బీజేపీ 38, కాంగ్రెస్ 1 చోట్ల ఆధిక్యం
28స్థానాల్లో బీజేపీ లీడ్
- ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ముందంజ
- గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ ముందంజ
- బద్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజ
- బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గహ్లోత్ ముందంజ
- 28స్థానాల్లో ముందంజలో బీజేపీ
- 17సీట్లలో లీడ్‌లో కొనసాగుతోన్న ఆప్
- ఒక స్థానంలో కాంగ్రెస్ అధిక్యం
పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ-ఆప్ హోరాహోరీ
- దిల్లీలో అసెంబ్లీ ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ-ఆప్ హోరాహోరీ
- పోస్టల్ బ్యాలెట్లలో 15 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
- పోస్టల్ బ్యాలెట్లలో 17 స్థానాల్లో ఆప్ ఆధిక్యం
- పోస్టల్ బ్యాలెట్లలో 2 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
- కల్కాజీ స్థానంలో దిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజ
- జంగ్‌పురలో మనీశ్ సిసోదియా వెనుకంజ
- న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ ముందంజ
- కల్కాజీ స్థానంలో దిల్లీ సీఎం ఆతిశీ వెనుకంజ
- జంగ్‌పురలో మనీశ్ సిసోదియా వెనుకంజ
- షాకుర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్రకుమార్ జైన్ ముందంజ
కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- మొత్తం అసెంబ్లీ సీట్లు 70, మేజిక్ ఫిగర్ 36 సీట్లు
- 19 కౌంటింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
- ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
కౌంటింగ్ ప్రారంభం
- పటిష్ట భద్రత మధ్య దిల్లీలోని 19 ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ ప్రారంభం
- మొత్తం అసెంబ్లీ సీట్లు 70, మేజిక్ ఫిగర్ 36 సీట్లు
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదు
- 70 అసెంబ్లీ స్థానాల బరిలో 699 మంది అభ్యర్థులు
- ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
- 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద 10 వేలమంది పోలీసుల మోహరింపు
కాసేపట్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- కాసేపట్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- ఓట్ల లెక్కింపు కోసం ఈసీ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
- 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద 10 వేలమంది పోలీసుల మోహరింపు
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ 36 సీట్లు
- దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 శాతం పోలింగ్ నమోదు
- 70 అసెంబ్లీ స్థానాల బరిలో 699 మంది అభ్యర్థులు
- దిల్లీ: వరుసగా నాలుగోసారి అధికారం కోసం ఆప్ యత్నం
- దిల్లీలో 27 ఏళ్ల నుంచి అధికారం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ