ప్రశాంతంగా కొనసాగుతన్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
రాజ్‌నివాస్ మార్గ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
కాల్‌కాజీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ
Published : Feb 5, 2025, 6:41 AM IST
|Updated : Feb 5, 2025, 10:09 AM IST
Delhi Assembly Polls 2025 Live Updates :దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. దిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, భారత ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్‌జనశక్తి రాం విలాస్ పాసవాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
LIVE FEED
ప్రశాంతంగా కొనసాగుతన్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
రాజ్‌నివాస్ మార్గ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
కాల్‌కాజీ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఓటింగ్‌లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మొత్తం 70 స్థానాలకు జరుగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ ప్రారంభమైంది.