తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైద్య కళాశాలకు మృతదేహాలు దానం- ఒకే గ్రామం నుంచి 185మంది డొనేషన్​- దేశంలోనే అత్యధికం! - Dead Bodies Donation In Karnataka

Dead Bodies Donation In Karnataka : ఒకే గ్రామానికి చెందిన 185మంది తమ మరణానంతరం మృతదేహాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ఈ విషయంపై ఎవరు అవగాహాన కల్పించారో ఈ స్టోరీలో చూద్దాం.

Dead Bodies Donation In Karnataka
Dead Bodies Donation In Karnataka (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 10:08 AM IST

Updated : Jul 2, 2024, 10:41 AM IST

వైద్య కళాశాలకు మృతదేహాలు దానం- ఒకే గ్రామం నుంచి 185మంది డొనేషన్​- దేశంలోనే అత్యధికం! (ETV bharat)

Dead Bodies Donation In Karnataka: మరణానంతరం అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన వాళ్లని చాలా మందిని చూశాం. కానీ ఏదో భాగాన్ని కాకుండా మొత్తం శరీరాన్ని దానం చేయడంలో ముందున్నారు కర్ణాటకలో ఓ గ్రామ ప్రజలు. వైద్య విద్యార్థులకు సాయం చేసేందుకు ఏకంగా 185మంది ముందుకు వచ్చారు. దహన సంస్కారాలు చేయకుండా వైద్య విద్యార్థుల కోసం దానం చేసి ఆదర్శంగా నిలుస్తోంది బెళగావి జిల్లాలోని షేగుణసి గ్రామం. ఇప్పటికే 108 మంది దానం చేయగా తాజాగా మరో 185మంది ముందుకు వచ్చారు. వారిలో 17మృతదేహాలను వైద్య కళాశాలకు అందించారు.

మృతదేహాన్ని దానం చేసేముందు పూజలు నిర్వహిస్తామని గ్రామస్థులు అంటున్నారు. కులం, మతం వంటి బేధాలు లాంటివి ఏమి లేవని, ఎవరు చనిపోయినా పూజలు నిర్వహించి మృతదేహాలను వైద్య కళాశాలకు అప్పగిస్తామని గ్రామస్థుడు సిద్ధన్న చెబుతున్నాడు. 'చనిపోయిన తర్వాత కూడా మరొకరికి ఉపయోగపడుతుందనేది మా ఏకైక ఉద్దేశం. 2010లో మా గ్రామంలో ఓ సంస్థ యోగా సంబంధించి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడకు డాక్టర్ మహంతేశ్ రామన్నవర్ అనే డాక్టర్ వచ్చి ఈ మృతదేహాల దానం గురించి అవగాహన కల్పించారు. ఆ సమయంలో స్వచ్ఛందంగా 108మంది మరణానంతరం తమ మృతదేహాలను ఇచ్చేందుకు నమోదు చేసుకున్నారు' అని సిద్ధన్న తెలిపాడు.

అప్పుడే నిర్ణయించుకున్నా
'మా నాన్న దంత వైద్యుడు. 2008లో మా నాన్న మరణించినప్పుడు కేఎల్​ఈ సంస్థకు మృతదేహాన్ని దానం చేశాను. ఆ తర్వాత మా నాన్న మృతదేహాన్ని వైద్య విద్యార్థులకు క్లాస్​ చెప్పడం కోసం ఉపయోగించడం చూశాను. ఇక అప్పటి నుంచి మృతదేహాల దానంపై అవగాహన కల్పించడం ప్రారంభించాను. ఇప్పటికే 5వేల మందికి పైగా కేఎల్​ఈ సంస్థలో పేర్లు నమోదు చేసుకున్నారు. సుమారు 200మృతదేహాలు దానంగా ఇచ్చారు. బెళగావిలోని షేగుణసి గ్రామం వారు 185మంది దాతలు ఉన్నారు. దేశంలో అత్యధికంగా దాతలు పేర్లు నమోదు చేసుకున్నది షేగుణసి గ్రామమే' అని డాక్టర్ మహంతేశ్ రామన్నవర్ తెలిపారు.

రెస్ట్ లేకుండా 17గంటలు స్విమ్మింగ్​​- ఇంగ్లీష్​ ఛానల్​ను ఈది 'ఇండియన్ మదర్'​గా రికార్డ్

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం- 9మంది దుర్మరణం

Last Updated : Jul 2, 2024, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details