Sister Pregnant By Cousin Brother In Moradabad :ఓ యువకుడు తన సొంత మైనర్ మరదలిపై అత్యాచారానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. అబార్షన్ కోసం గర్భనిరోధక మాత్రలు వాడినా ప్రయోజనం లేకపోవడం వల్ల, చివరకు ఆ యువకుడు తన తల్లి, సోదరుడితో కలిసి మైనర్‌కు యాసిడ్ తాగించారు. దీంతో ఆమె పరిస్థితి విషమించగా, నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, మొరాదాబాద్ జిల్లాకు చెందిన జావేద్ అనే యువకుడు ఎనిమిది నెలల క్రితం తన మామ వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన మైనర్ మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. అదే విషయాన్ని యువకుడికి చెప్పగా, ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. అయినా మైనర్‌కు అబార్షన్ కాలేదు. దీంతో గర్భాన్ని తొలగించడానికి యువకుడు, తన తల్లి కలిసి అతడి సోదరుడికి యాసిడ్ బాటిల్ ఇచ్చి మైనర్‌కు పంపించారు. అది అబార్షన్ కోసం తీసుకొచ్చిన మందు అని చెప్పి నమ్మించారు. దీంతో యాసిడ్ తాగిన బాధితురాలి పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.