Congress On New EC Rules :ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ చర్యల వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగవచ్చని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఇటీవల చేసిన సవరణలను సవాలు చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
ఎలక్షన్ రూల్స్‌లో మార్పులు- సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్ - CONGRESS ON NEW EC RULES
ఎన్నికల నిబంధనల మార్పులపై సుప్రీం కోర్టుకు కాంగ్రెస్- సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్
Published : Dec 24, 2024, 4:40 PM IST
ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది. పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్, వెబ్‌కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు- 1961లోని రూల్ 93(2)(ఏ)ను కేంద్ర న్యాయశాఖ సవరించింది.
ఈ చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇదే అంశంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సుప్రీం కోర్టులో తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా, ప్రజలతో సంప్రదింపులు లేకుండా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయడం దారుణమన్నారు.