తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చల్లని చిరుజల్లుల వేళ - ఇలా "చికెన్ సూప్" చేసుకొని సిప్ చేయండి - జిందగీ ఖుష్ అవ్వాల్సిందే! - Chicken Soup Recipe

Chicken Soup Recipe In Telugu : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు.. ఆకాశం చిరు జల్లులు చిలకరిస్తున్నప్పుడు.. వేడి వేడిగా ఏదైనా సూప్ తాగితే ఆహా.. అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి ఓ సూప్​ రెసిపీ మీకోసం తెచ్చాం. అదే "చికెన్ సూప్". ఇది సూపర్ టేస్టీగా ఉండడమే కాదు.. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారినీ వెంటనే క్యూర్​ చేస్తుంది! మరి.. ఈ టేస్టీ చికెన్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా..!

How To Make Chicken Soup Recipe
Chicken Soup Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 10:26 AM IST

How To Make Chicken Soup Recipe : చాలా మందికి వాతావరణం చల్లగా మారిన వేళ.. వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. కాఫీ, టీ రొటీన్​. కాబట్టి.. వెరైటీగా సూప్​(Soup) జుర్రితే భలే ఉంటుంది! అలాంటి వారికోసం.. రుచి, కమ్మదనం, ఒంటికి వెచ్చదనంతోపాటు ఇమ్యూనిటీ పవర్​ అందించే ఒక అద్భుతమైన నాన్​వెజ్ సూప్​ పట్టుకొచ్చాం. అదే.. నోరూరించే "చికెన్ సూప్". దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తాగారంటే.. ఆహా ఏమి రుచీ అని పాడుకోవడం పక్కా! అంతేకాదు.. జలుబు, దగ్గుతో నోటికి ఏమీ రుచించనప్పుడు ఈ సూప్​ని తాగితే.. వెంటనే రిలీఫ్ లభిస్తుందంటున్నారు నిపుణులు. మరి.. ఈ చికెన్ సూప్​ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - 200 గ్రాములు(విత్ బోన్స్)
  • నెయ్యి/నూనె - 2 టీస్పూన్లు
  • లవంగాలు - 3
  • యాలకులు - 2
  • బిర్యానీ ఆకు - 1
  • దాల్చిన చెక్క - 1
  • ఉల్లిపాయలు - 2
  • పసుపు - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • అల్లం - కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • మిరియాలు - 1 టీస్పూన్
  • నిమ్మరసం - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • వాటర్ - తగినంత

తయారీ విధానం :

  • ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చికెన్(Chicken) శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
  • కొత్తిమీర మిశ్రమం కోసం.. మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా తురుముకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తురుము కొద్దిగా, తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే.. ఒక టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు చికెన్ సూప్ కోసం.. స్టౌపై కుక్కర్​ పెట్టుకొని నెయ్యి పోసుకోవాలి. అది కరిగాక చిన్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలతో పాటు యాలకులను కాస్త ఓపెన్ చేసి వేసుకోవాలి.
  • ఆపై వాటిని కాసేపు వేయించుకొని సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి కాస్త మెత్తగా మారేవరకు వేయించుకోవాలి. అయితే, ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే కొద్దిగా పుదీనా తరుగు వేసుకోండి. ఇలా వేయడం వల్ల సూప్ టేస్ట్ పెరుగుతుంది.
  • ఉల్లిపాయ ముక్కలు వేగాక.. అందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని స్టౌ మంటను లో ఫ్లేమ్​లో పెట్టి 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అలా చికెన్ వేయించుకునేటప్పుడే ఆ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి.
  • చికెన్ వేగిందనుకున్నాక.. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మరికొద్దిసేపు ఆ మిశ్రమాన్ని మగ్గనివ్వాలి. అలా చేయడం ద్వారా ఇంగ్రీడియంట్స్ పచ్చివాసన పోతుంది.
  • అనంతరం రెండు గ్లాసుల వాటర్​ను ఆ మిశ్రమంలో పోసుకోవాలి. అదేవిధంగా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. అలాగే ఓసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని.. చాలకుంటే కాస్త వేసుకోవాలి.
  • ఇప్పుడు.. స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమాన్ని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి చూడండి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ రెడీ!

ABOUT THE AUTHOR

...view details