Chandrababu Fires on CM Jagan:తెలుగుదేశం అరకు కాఫీని ప్రమోట్ చేస్తే, వైఎస్సార్సీపీ గంజాయిని ప్రమోట్ చేస్తోందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఎద్దేవా చేశారు. అల్లూరి జిల్లా అరకులో 'రా కదిలి రా' బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని, ఎన్నో కాఫీలు ఉన్నా అరకు కాఫీకి ప్రత్యేమైందని పేర్కొన్నారు. గతంలో జరిగిన దావోస్ మీట్ లో సైతం అరకు కాఫీని పరిచయం చేశామని చెప్పారు. భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తానికి తీసుకెళెందుకు కృషి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
16 పథకాలను రద్దుచేసిన వైఎస్సార్సీపీ: గిరిజనుల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వంలో 16 పథకాలను ప్రత్యేకంగా పెట్టామని చంద్రబాబు తెలిపారు. ఆ16 పథకాలు ఎందుకు రద్దుచేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్‌కు ఇష్టం లేదని, అందుకే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కూడా రద్దుచేశారని చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వంలో గిరిజనులు ప్రపంచంలో ఎక్కడ చదివినా స్కాలర్‌షిప్పులు ఇస్తే, అలాంటి పథకాన్ని జగన్ తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజన హస్టల్లో చదువుతున్న బాలిక ప్రసవం - సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ దారుణమన్న స్థానికులు
జీవో నంబర్ 3 రద్దుచేయడం సామాజిక న్యాయమా!: గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించామని అందుకోసమే, టీడీపీ ప్రభుత్వంలో జీవో నం.3 తీసుకొచ్చామన్నారు. తాను తీసుకువచ్చిన జీవో నం.3ని ఎందుకు రద్దుచేశారో వైఎస్సార్సీపీ నేతలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎం జగన్ మాత్రం సామాజిక న్యాయం చేస్తున్నానంటూ గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. జీవో నంబర్ 3 రద్దుచేయడం సామాజిక న్యాయమా! అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే జీవో నంబర్ 3 పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఉద్యోగాలు గిరిజనులకే ఇచ్చేలా పోరాటం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ గిరిజనుల పొట్టకొట్టే ప్రభుత్వమని చంద్రాబాబు విమర్శించారు. నమ్మించి గొంతుకోసిన వ్యక్తి జగన్ అంటూ ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం చైతన్యం పేరుతో గిరిజనుల సంక్షేమానికి నాంది పలికిందని చంద్రబాబు గుర్తుచేశారు.
గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కొత్తపల్లి గీత
కనీసం అంబులెన్స్‌ను కూడా పంపలేదు: గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా అని వైఎస్సార్సీపీని ప్రశ్నించారు. సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో చిట్టంపాడుకు చెందిన గర్భిణి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే కనీసం అంబులెన్స్‌ను కూడా పంపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకూ తన భార్య మృతదేహాన్ని స్కూటర్‌పై ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కేవలం సీఎం నొక్కే బటన్ ఒకటి, బుక్కే బటన్ ఒకటి అని ఎద్దేవా చేశారు. జగన్ దోచేది ఎక్కువ.. జనాలకు ఇచ్చేది తక్కువ అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
భార్య మృతదేహం బైక్‌పై తరలింపు - జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం : నారా లోకేశ్