ETV Bharat / bharat

కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చే ఆ పార్టీలోకి వచ్చా: వైఎస్‌ షర్మిల

YS Sharmila To Visit Idupulapaya YSR Ghat: రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా అందరితో కలిసి పనిచేస్తానని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడప వచ్చిన ఆమె ఇడుపులపాయలోని వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులు ఆర్పించారు. ఆదివారం పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న వేళ తన తండ్రి ఆశీర్వాదం కోసం వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

YS Sharmila To Visit Idupulapaya YSR Ghat

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 9:01 PM IST

Updated : Jan 24, 2024, 12:37 PM IST

YS Sharmila To Visit Idupulapaya YSR Ghat: రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే రాజశేఖర్ రెడ్డి కలను నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఆదివారం పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఈరోజు సాయంత్రం ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.

సిద్దాంతాల కోసం వైఎస్సార్ ఎంత దూరం అయినా వెళ్లే వాడు: దేశంలోనే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ సిద్ధాంతాలను కొనసాగించడానికి చివరి వరకు కృషి చేస్తానని వైఎస్ షర్మిల అన్నారు. రేపు ఉదయం విజయవాడ లో ఏపీ పీసీసీ చీఫ్ గా భాద్యతలు తీసుకుంటున్న సందర్భంగా ఇవ్వాళ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని చెప్పారు. వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు. వైఎస్సార్ కు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానం అన్నారు. సిద్ధాంతాల కోసం వైఎస్సార్ ఎంత దూరం అయినా వెళ్లే వాడని షర్మిల పేర్కొన్నారు. ఇవ్వాళ దేశంలో సెక్యులరిజం అనే పదానికి, ఫ్యూడలిజం అనే పదాలకు అర్థం లేకుండ పోయిందన్నారు. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది- ఇవన్నీ మళ్లీ నెలకొనాలనీ వైఎస్ షర్మిల ఆకాంక్షించారు.

షర్మిల వల్ల వైఎస్సార్సీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు: సజ్జల

పార్టీకి పూర్వ వైభవం వస్తుంది: రాజశేఖరరెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించిన తరహాలోనే షర్మిలమ్మను కూడా ప్రతి కార్యకర్త అభిమానించాలని పిలుపునిచ్చారు. షర్మిలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కేవీపీ రామచంద్రరావు అభ్యర్థించారు.

'ముహూర్తం ఖరారు' పీసీసీ అధ్యక్షురాలిగా ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల

కాంగ్రెస్​లో చేరిన మాజీ మంత్రి: సాయంత్రం హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో షర్మిలతో పాటు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు కడప విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. కడప నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయకు దాదాపు 100 వాహనాల్లో కాన్వాయ్ రాగా, అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. వేంపల్లిలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇడుపులపాయ ఘాటు వద్దకు చేరుకున్న షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేసి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల సమక్షంలోనే మాజీ మంత్రి అహమదుల్లా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చే ఆ పార్టీలోకి వచ్చా: వైఎస్‌ షర్మిల

వైఎస్‌ ఆశీర్వాదం తీసుకునేందుకే ఇడుపులపాయకు వచ్చాను. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునేముందు మా తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి వచ్చాను. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చే ఆ పార్టీలో చేరాను. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసం పనిచేసేందుకు కృషి చేస్తాను. రాహుల్‌ను ప్రధాని చేసేవరకు అందర కలిసి పనిచేస్తాం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల- ఖరారైన ముహూర్తం

Last Updated : Jan 24, 2024, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.