Jayalalithaa Assets Case Updates :తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటి జయలలితకు చెందిన జప్తు చేసిన ఆస్తులన్నింటినీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీబీఐ కోర్ట్ ఆదేశించింది. జయలలిత మేనకోడలు జె.దీప, మేనల్లుడు జె.దీపక్ దాఖలు చేసిన పిటిషన్ను జనవరి 1న కర్ణాటక హైకోర్ట్ తోసిపుచ్చిన తరువాత సీబీఐ కోర్ట్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
'జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయండి'- సీబీఐ కోర్ట్ ఆదేశం - JAYALALITHAA ASSETS CASE UPDATES
జయలలిత ఆస్తుల కేసు- జప్తు చేసిన ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీబీఐ కోర్ట్ ఆదేశం
Published : Jan 29, 2025, 11:04 PM IST
జయలలిత అదాయవనరులకు మించి ఆస్తులు కూడబట్టిన కేసులో దోషిగా తేలారు. కానీ 2016తో ఆమె మరణించిన తరువాత ఆ కేసు విచారణను కోర్టు నిలిపివేసింది. అయితే ఆమె ఆస్తుల జప్తును సుప్రీంకోర్ట్ సమర్ధించింది. అయితే జయలలితపై ఉన్న కేసును కొట్టివేసినందున, ఆమె ఆస్తులను జప్తు చేయకూడదని ఆమెకు చెందిన బంధువులు వాదించారు. అయితే ప్రత్యేక కోర్ట్ ఈ కేసులో ఇతరులను దోషులుగా నిర్ధరించిందని, అందువల్ల ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.
జయలలిత ఆస్తుల వివరాలు
చెన్నైలోని పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసం- వేద నిలయం, డీఏ కేసుతో ముడిపడి ఉన్న అనేక భూములు, ఎస్టేట్లు ఉన్నాయి. అలాగే ఆమె పేరుమీదున్న బ్యాంక్ డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఇవికాక బంగారు ఆభరణాలు ఉన్నాయి.