Bus Accident Mumbai :మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బెస్ట్ బస్సు పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది.
బస్సు బ్రేక్స్ ఫెయిల్!- ఆరుగురు మృతి - MUMBAI BUS ACCIDENT
ముంబయిలో బస్సు ప్రమాదం - ఆరుగురు మృతి
Published : Dec 10, 2024, 7:04 AM IST
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం- సోమవారం రాత్రి కుర్లా నుంచి అంధేరికి బెస్ట్ బస్సు వెళ్తుండగా బుద్ద కాలనీ వద్ద బ్రేకులు విఫలమై పాదచారులు, కొన్ని వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు . సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే బస్సు ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. 43 మంది క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు ఢీకొట్టడం వల్ల అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. బస్సును అతివేగంతో నడిపినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు దెబ్బతిన్న వాహనాలను తొలిగించే పనులు చేపట్టారు.