తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్లైఓవర్ నుంచి కింద పడిన బస్సు- ఐదుగురు మృతి, 40మందికి గాయాలు - Bus Accident In Odisha - BUS ACCIDENT IN ODISHA

Bus Accident In Odisha : ఒడిశాలోని జాజ్​పుర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు వంతెనపై నుంచి పడటం వల్ల ఐదుగురు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఒడిశా సీఎం రూ.3 లక్షల ఆర్థిక సహాయన్ని ప్రకటించారు.

Bus Accident In Odisha
Bus Accident In Odisha

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 6:56 AM IST

Updated : Apr 16, 2024, 8:34 AM IST

Bus Accident In Odisha : బస్సు వంతెనపై నుంచి పడి ఐదుగురు మృతి చెందారు. 35మంది గాయపడ్డారు. ఈ ఘటన ఒడిశా జాజ్​పుర్​​ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది
మొత్తం 47మంది ప్రయాణికులతో పూరీ నుంచి బంగాల్​కు సోమవారం మధ్యాహ్నం బస్సు బయలుదేరింది. రాత్రి 9 గంటల సమయంలో జాజ్​పుర్​​లోని 16వ జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బారాబతి వద్ద ఫ్లైఓవర్ దాటుతుండగా బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఫ్లైఓవర్​ పైనుంచి బస్సు రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ సహా ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. గాయపడిన వారి వెంటనే కటక్​లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.

ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రవాణా కమిషనర్ అమితవ్ ఠాకూర్ తెలిపారు. 'ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 16 అంబులెన్స్​ల సాయంతో కటక్​ ఆస్పత్రికి తరలించాం. గ్యాస్​ కట్టర్లను ఉపయోగించి బస్సు కిటికీలు కత్తిరించి ప్రయాణికులను రక్షించాం. అనంతరం బస్సును క్రేన్​ సహాయంతో పైకి తీశాం. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బంగాల్​కు చెందినవారే ఉన్నారు' అని అమితవ్ పేర్కొన్నారు.

రోడ్డు పక్కన నిల్చున్న వారిపై మట్టి లారీ బోల్తా- ఐదుగురు మృతి
Lorry Overturned Today Karnataka :ఇటీవలేకర్ణాటకలోని బాగల్​కోట్​ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని మట్టి లోడ్​తో వెళ్తున్న లారీ బలిగొంది. రోడ్డు పక్కన నిల్చున వారిపై ఆ లారీ బోల్తా పడడం వల్ల అక్కడికక్కడే వారంతా మృతిచెందారు. ఈ ఘటన జరిగిన అనంతరం లారీ డ్రైవర్ వెంటనే పరారయ్యాడు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

రూ.150 టికెట్‌తో 50 నిమిషాల ఫ్లైట్ జర్నీ- ఈ సూపర్ స్కీమ్ గురించి మీకు తెలుసా? - Cheapest Airplane Ticket In India

'2024లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు'- IMD గుడ్​న్యూస్​ - Monsoon Prediction 2024 IMD

Last Updated : Apr 16, 2024, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details