తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం- నలుగురు మృతి- శిథిలాల కింద అనేక మంది! - Building Collapse In west bengal

Building Collapse In Kolkata : కోల్​కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలి నలుగురు మరణించారు. మరో ఏడుగురికి గాయలయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది మరో పది మందిని కాపాడారు.

Building Collapse In Kolkata
Building Collapse In Kolkata

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 10:50 AM IST

Updated : Mar 18, 2024, 1:13 PM IST

Building Collapse In Kolkata : బంగాల్​ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలి నలుగురు మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని అనే అనుమానంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని నగర మేయర్ ఫిర్హాద్ హకీమ్​ తెలిపారు. అయితే ఈ ఘటన ఆదివారం రాత్రి గార్డెన్ రిచ్ ప్రాంతంలో జరిగినట్లు పేర్కొన్నారు.

మృతుల కుటంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఈ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. 'ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. ఈ భవన నిర్మాణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై దర్యాప్తును చేపట్టారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం అందిస్తాం. ఈ ఘటన వల్ల సమీపంలో ఉన్న ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వారికి కూడా సహాయం చేస్తుంది' అని మమతా బెనర్జీ తెలిపారు.

ఘటన జరిగిన భవనంలో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. కానీ, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలపై శిథిలాలు పడ్డాయని చెప్పారు. వాటిలో ఎవరైనా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. పదుల సంఖ్యలో చిక్కుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్సులను సిద్ధంగా ఉంచామని నగర సీపీ వినీత్‌ గోయల్‌ తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. కావాల్సిన సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని 'ఎక్స్‌' వేదికగా విజ్ఞప్తి చేశారు.

4 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు
Delhi Fire Accident Today : ఇటీవలే దిల్లీ శాస్త్రి నగర్‌ ప్రాంతంలోని 4 అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు బాలికలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

గూడ్స్​ రైలును ఢీకొన్న సబర్మతి ఎక్స్​ప్రెస్​- పట్టాలు తప్పిన ఇంజిన్ సహా 4 బోగీలు

పెళ్లికి వెళ్లి వస్తున్న కారు, ట్రాక్టర్​ ఢీ- ముగ్గురు చిన్నారుల సహా ఏడుగురు మృతి

Last Updated : Mar 18, 2024, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details