BJP Manifesto For Haryana Assembly Polls : హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. లడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, హర్ ఘర్ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. హరియాణాకు చెందిన ప్రతీ అగ్నివీర్‌కు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. సంకల్ప పత్ర పేరిట రోహ్‌తక్‌లో ఈ మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు.24 రకాల పంటలకు కనీస మద్దతు ధర సహా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్ ఖర్ఖోడా తరహాలో పది పారిశ్రామిక నగరాలను నిర్మిస్తామని హామీ ఇచ్చింది. హరియాణాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య అభ్యసించినా వారికి స్కాలర్‌షిప్స్ అందిస్తామని హామీ ఇచ్చింది. యువత, పేదలు, రైతులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని ఈ సంకల్ప్ పత్రం రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు. అక్టోబర్ 5వ తేదీన హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రూ.500కే గ్యాస్ సిలిండర్ - హరియాణా ప్రజలకు బీజేపీ హామీల వర్షం! - BJP Manifesto For Haryana Polls - BJP MANIFESTO FOR HARYANA POLLS
BJP Manifesto For Haryana Assembly Polls : హరియాణా అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. లడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, హర్ ఘర్ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పలు హామీలు ఇచ్చింది.
BJP Manifesto For Haryana Assembly Polls (ANI)
Published : Sep 19, 2024, 1:02 PM IST
|Updated : Sep 19, 2024, 1:54 PM IST
బీజేపీ ఎన్నికల హామీలు
- హరియాణా ఎన్నికల కోసం సంకల్ప్ పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో
- మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని హామీ
- రూ.500కే గ్యాస్ సిలిండర్
- 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన
- అగ్నివీరులకు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం
- ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాలు
- పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణం
- హరియాణాలో 10 పారిశ్రామిక నగరాల నిర్మాణం
- చిరాయు-ఆయుష్మాన్ యోజన కింద, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఉచిత చికిత్స
- కుటుంబంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి పెద్దకు విడివిడిగా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స
- జాతీయ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ పథకం కింద 5 లక్షల మంది యువతకు శిక్షణ
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ ఉచితం, అలాగే అన్ని ఆసుపత్రుల్లో రోగ నిర్ధరణ ఉచితం
- అవ్వల్ బాలికా యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీకి వెళ్లే ప్రతి అమ్మాయికి స్కూటర్
- భారత ప్రభుత్వ మద్దతుతో ఫరీదాబాద్, గురుగ్రామ్‌ల మధ్య రైలు, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మెట్రో సేవలు
- దక్షిణ హరియాణాలో అంతర్జాతీయ స్థాయిలో ఆరావళి జంగిల్ సఫారీ పార్క్ ఏర్పాటు
Last Updated : Sep 19, 2024, 1:54 PM IST