BJP Candidate List 2024 :రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది బీజేపీ. మొత్తం 195 స్థానాలకుగానూ బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలోకి దిగనున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్‌డే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ తొలి జాబితా వెల్లడైంది.
34 మంది కేంద్రమంత్రులకు చోటు
ఈ జాబితాలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ సహా 34 మంది కేంద్రమంత్రుల పేర్లను ప్రకటించారు. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు చోటు కల్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తావ్‌డే విశ్వాసం వ్యక్తంచేశారు.
రాష్ట్రాలవారీగా అభ్యర్థుల లెక్కలు
- బంగాల్- 27
- మధ్యప్రదేశ్- 24
- గుజరాత్- 15
- రాజస్థాన్- 15
- కేరళ- 12
- తెలంగాణ- 9
- ఝార్ఖండ్- 11
- ఛత్తీస్‌గఢ్- 12
- దిల్లీ- 5
- జమ్మూకశ్మీర్- 2
- ఉత్తరాఖండ్- 3
- అరుణాచల్ ప్రదేశ్- 2
- గోవా- 1
- త్రిపుర- 1
- అండమాన్ నికోబార్- 1
- దమన్ అండ్ దీవ్- 1
బీజేపీ విడుదల చేసిన ఈ తొలి జాబితాలో 28 మంది మహిళలకు, 47 మంది యువతకు, 27 మంది ఎస్సీలకు, 18 మంది ఎస్టీలకు అవకాశం కల్పించినట్లు వినోద్ తావ్‌డే తెలిపారు. 57 మంది ఓబీసీలను బరిలో నిలిపామని చెప్పారు.
పోటీలో ఉన్న కేంద్ర మంత్రులు వీరే
- అమిత్‌షా
- రాజ్‌నాథ్ సింగ్
- స్మృతీ ఇరానీ
- మన్‌సుఖ్ మాండవీయ
- జితేంద్ర సింగ్
- సర్బానంద సోనోవాల్
- గజేంద్ర షెకావత్
- భూపేంద్ర యాదవ్
- కిషన్ రెడ్డి, కిరెన్ రిజిజు
- జ్యోతిరాదిత్య సింధియా
- రాజీవ్ చంద్రశేఖర్
- అర్జున్ రామ్ మేఘ్వాల్
- అర్జున్ ముండా