తెలంగాణ

telangana

కోడి గుడ్డుతో 10 వెరైటీ రెసిపీస్ - మీరు ఎప్పుడూ టేస్ట్ చేయని రకాలు!

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 10:43 AM IST

Best Egg Recipes : కోడిగుడ్డుతో వంటకాలు అంటే.. చాలా మందికి తెలిసింది. ఆమ్లెట్, ఎగ్ దోశ.. లేదంటే ఉల్లిగడ్డ, టమాటల్లో వేసి కర్రీ చేయడం. కానీ.. ఎన్నాళ్లు ఆ రొటీన్ పద్ధతిలో తింటారు? అందుకే.. మీకోసం వెరైటీ ఎగ్ రెసిపీస్ తీసుకొచ్చాం. అవేంటో చూడండి.. ఓ పట్టు పట్టండి.

Best Egg Recipes
Best Egg Recipes

Best Egg Recipes :మనకు ప్రొటీన్ అందించే ఆహారాల్లో గుడ్డు ఒకటి. తక్కువ ధరలో మంచి పోషకాలను గుడ్డు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మనలో చాలా మందికి గుడ్డుతో ఆమ్లెట్‌ వేసుకోవడం, కర్రీ చేసుకోవడం మాత్రమే తెలుసుంటుంది. కానీ, ఎగ్‌తో రకరకాలడిష్‌లను తయారు చేయవచ్చని మీకు తెలుసా? ఆ వెరైటీ వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బేక్‌డ్‌ ఎగ్స్‌..
ఎగ్‌ను నేరుగా తీసుకోలేని వారికి ఇది ఒక మంచి రెసిపీ. ఇందులో రెండు మూడు గుడ్లను తీసుకుని అందులో ఆమ్లేట్‌ వేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చీజ్‌, పొటాటోస్‌ ముక్కలను యాడ్‌ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మిశ్రమాన్ని వేసుకుని బేక్ చేసుకోవాలి. అంతే బేక్‌డ్‌ ఎగ్స్ డిష్ రెడీ.

ఎగ్‌ నూడుల్స్‌..
మనలో నూడుల్స్ ఇష్టంలేని వారుండరు. అయితే, ఈ నూడుల్స్ మరింత టేస్ట్‌గా ఉండాలంటే అందులో ఎగ్స్ ఉండాల్సిందే. ఎగ్‌ నూడుల్స్‌ చేసుకునే ముందు రెండు మూడు ఎగ్స్‌ను పొడిపొడిగా ఫ్రై చేసుకుని నూడుల్స్‌లో యాడ్‌ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. టెస్టీ ఎగ్‌ నూడుల్స్ రెడీ.

పొడిపొడిగా ఎగ్‌ ఫ్రై..
ఎగ్‌ కర్రీ చేయడానికి అంత టైం లేకపోతే ఈ డిష్‌ను ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా ఉల్లిపాయలు, టమటా, పచ్చిమిర్చి వంటి వాటిని సన్నగా కట్‌ చేసుకుని పాన్‌లో ఫై చేసుకోండి. ఆ తర్వాత రెండు మూడు గుడ్లను పగలగొట్టి, సరిపడా ఉప్పు, కారం, మసాలను యాడ్‌ చేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలో, చపాతీల్లోకి సైడ్‌ డిష్‌గా బాగుంటుంది.

ఎగ్‌పొటాటో సలాడ్‌..
సలాడ్‌ అనగానే అన్ని రకాల పండ్లతోనే చేస్తారని అనుకుంటారు. కానీ, ఎగ్‌, పొటాటోలతో కూడా చేసుకోవచ్చు. ఉడికించిన బంగాళదుంపలు, గుడ్లను ఒక పాత్రలోకి తీసుకుని అందులోకి ఆనియన్, మయోనైజ్‌, ఉప్పు, పెప్పర్‌ వంటి వాటిని యాడ్‌ చేసుకుని సలాడ్‌లా తినొచ్చు.

ఎగ్‌ కస్టర్డ్‌ పుడ్డింగ్ (Custard pudding)..
గుడ్లతో స్వీట్‌ రెసిపీ చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌. ముందుగా చెక్కెరతో పాకం తయారుచేసుకోవాలి. ఆ తర్వాత ఒక నాలుగు గుడ్లను తీసుకుని అందులో పాలను అడ్‌ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆందులో కొద్దిగా షుగర్‌ అడ్‌ చేసుకుని, బేకింగ్‌ పాత్రలో చక్కెర పాకం వేసుకోవాలి. ఇప్పుడు అందులో పాల మిశ్రమాన్ని పోసుకుని బేక్‌ చేసుకోవాలి. తర్వాత రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే ఎంతో టెస్టీగా ఉంటుంది.

ఎగ్‌ చపాతీ..
సాధారణంగా ఇంట్లో అందరూ చపాతీ చేసుకుంటారు. కానీ, వీటికి అదనంగా టేస్ట్‌ను జోడించాలంటే అది ఎగ్‌ చపాతీతోనే సాధ్యం. ముందుగా రెండు మూడు గుడ్లతో పాటు, ఎగ్‌ ఆమ్లేట్‌కు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. తర్వాత కొద్దిగా రెండు వైపులా కాల్చిన చపాతీపైఈ మిశ్రమాన్ని పోసి బాగా కాల్చుకోవాలి. అంతే టేస్టీ ఎగ్‌ చపాతీ రెడీ.

బేక్‌డ్‌ అవకాడోస్‌..
అవకాడో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలున్నాయని మనకు తెలిసింది. ఈ సారి ఇలా ట్రై చేయండి. ముందుకు రెండుగా కట్‌ చేసిన అవకాడోస్‌లో ఎగ్‌ను పగలగొట్టి ఆ మిశ్రమాన్ని వేయండి. తర్వాత దానిలో కొద్దిగా పెప్పర్‌, కారం, ఉప్పును చల్లి బేక్‌ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బేక్‌డ్‌ అవకాడోస్‌ రెడీ.

కేడ్గేరీ (Kedgeree)..
ఈ కేడ్గేరీ ఎగ్‌ డిష్‌ను బ్రిటిష్-ఇండియన్ ఫేవరెట్‌గా చెబుతారు. ఇందులో చేపలు, రైస్‌, బఠానీలను ఉపయోగిస్తారు. బాయిల్‌డ్‌ రైస్‌లో ఉడికించిన చేపలు, హాఫ్‌ బాయిల్‌డ్‌ ఎగ్‌లను యాడ్‌ చేసుకుని ట్రై చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది.

Sunday Special Non Veg Curries : సండే స్పెషల్.. నాటుకోడి కూర.. బోటీ మసాలా ఫ్రై.. ఇలా చేశారంటే.. బొక్కకూడా వదలరు

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

Egg Recipes Telugu : సండే స్పెషల్.. కాస్త వెరైటీగా ఈ 'గుడ్డు' స్నాక్స్ ట్రై చేయండి.. వెరీగుడ్ అనక మానరు

ABOUT THE AUTHOR

...view details