Belagavi Road Accident :కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెట్టును కారు ఢీకొట్టడం వల్ల గురువారం సాయంత్రం జరిగిందీ దుర్ఘటన.
మృతులందరూ ధార్వాడ్లోని లంగోటి గాలికి చెందినవారని పోలీసులు తెలిపారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని చెప్పారు. తొమ్మిది మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతులను షారుక్ పెండారి (30), ఇక్బాల్ జమాదార్ (50), సానియా లంగోటి (37), ఉమ్రా బేగం లంగోటి (17), షబానాబాను లంగోటి (37), పరన్ లంగోటి (13)గా పోలీసులు గుర్తించారు.
రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి
Bihar Road Accident : ఇటీవలే బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఆటో, లారీ పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. బాధితులు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు పోలీసులు.
వివాహ వేడుకకు వెళ్లి వస్తూ!
జిల్లాలోని లఖీసరాయ్-సికంద్రా ప్రధాన రహదారికి సమీపంలో బిహరౌరా గ్రామంలో బుధవారం(ఫిబ్రవరి 21) తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు వెళ్లిన 15 మంది ఆటోలో తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆ సమయంలో లారీ, ఆటో పరస్పరం ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో వీర్ పాసవాన్, వికాస్ కుమార్, విజయ్ కుమార్, దిబానా పాసవాన్, అమిత్ కుమార్, మోను కుమార్, కిసాన్ కుమార్, మనోజ్ గోస్వామి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ముంగేర్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించినట్లు పోలీసులు చెప్పారు.
ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. లారీని స్వాధీనం చేసుకున్నామని, డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు అందించినట్లు చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
విలేజ్లో ఐటీ కంపెనీ - 500మందికి జీవనోపాధి! మాస్టర్ డిగ్రీకి అవకాశం
'అభివృద్ధి కోసం దేవుడు పంపిన వ్యక్తి మోదీ'- 'ఈటీవీ భారత్'తో శివరాజ్ సింగ్ ముఖాముఖి