Beer worth 98 crore seized in Karnataka :లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలోని చామరాజనగర్‌లో భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు అధికారులు. రూ.98 కోట్ల విలువైన బీర్లను అధికారులు సీజ్ చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 2) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చామరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల అధికారి సీటీ శిల్పనాగ్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఓ ప్రదేశంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారని సదరు వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో అలాంటి అక్రమ మద్యం నిల్వలపై చర్యలు తీసుకోవాలని శిల్పానాగ్ ఎక్సైజ్ డీసీ నాగశయనను ఆదేశించారు ఎలక్టోరల్ ఆఫీసర్. ఈ మేరకు మైసూర్ జిల్లా నంజనగూడు మండలం తాండ్యా ఇండస్ట్రియల్ ఏరియాలోని యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ యూనిట్‌పై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బృందం దాడులు జరిపింది. రూ.98.52 కోట్ల విలువైన బీర్లను సీజ్ చేసింది.
ఎన్నికల వేళ భారీ స్థాయిలో మద్యం పట్టివేత- రూ.98 కోట్ల బీర్లు సీజ్ - 98crore beer seized in Karnataka - 98CRORE BEER SEIZED IN KARNATAKA
Beer worth 98 crore seized in Karnataka : త్వరలో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రూ.98 కోట్ల విలువైన అక్రమ బీర్ల నిల్వలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
Published : Apr 4, 2024, 8:06 PM IST
|Updated : Apr 4, 2024, 10:15 PM IST
ఈ విషయంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగశయన వివరాలు వెల్లడించారు. 'ఎన్నికల అధికారి శిల్పనాగ్ ఆదేశాల మేరకు బ్రేవరీస్ యూనిట్ రికార్డులు, సీసీటీవీలు తనిఖీ చేశాం. మార్చి 30న ఈ యూనిట్ నుంచి 14 వేల కాటన్ల బీర్లు 17 లారీల్లో బయటలు వెళ్లినట్లు తెలిసింది. 7వేల కాటన్ల అక్రమ బీరు నిల్వలు, మరో 5,81,000 కాటన్ల బీర్లు కూడా సీజ్ చేశాం. వీటితో పాటు మద్యం తయారీకి ఉపయోగించే ముడిసరకును కూడా సీజ్ చేసి ఫ్యాక్టరీకి సీల్ వేశాం. ఇలా అక్రమంగా మద్యం నిల్వ ఉంచడం ఎక్సైజ్ చట్టానికి విరుద్ధం. దీనికి సంబంధించి కేసు నమోదు చేశాం. 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. తుదుపరి విచారణ కోసం వీరిని అదుపులోకి తీసుకుంటాం. ఇక ఎన్నికల ప్రవర్తనా నియామవళి కింద కూడా కేసు నమోదు చేశాం' అని వివరించారు.
ఇదిలా ఉండగా చమరాజనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏప్రిల్ 2 పోలింగ్ జరగనుంది. ఇక్కడ బీజేపీ నుంచి ఎస్ బాలరాజు బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున సునీల్ బోస్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు బుధవారం తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి శిల్పనాగ్కు సమర్పించారు.