ఆయుర్వేద వైద్యం చేయడంలో మంచి పేరు సంపాదించారు ఓ డాక్టర్. ఆయన చేసే ఆయుర్వేద వైద్యం దాదాపు 112 దేశాలకు విస్తరించింది. సినీ నటుల నుంచి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు వరకు ఆయన వద్ద వైద్యం పొందారు. వైద్యంలో అంత మంచి అనుభవం సాధించిన ఆయన, ఉన్నత చదువులు చదువుకుని ఉంటారని అనుకుంటారు కదా? కానీ ఆయన ప్రస్తుతం ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.
Ayurvedic Doctor Prakash Indian Tata Story : మధ్యప్రదేశ్ ఛింద్వాడాకు చెందిన ప్రకాశ్(84) ఇండియా ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిగా పేరు సంపాదించారు. ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే అమర్కంటక్లోని ఓ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడే దాదాపు 20 సంవత్సరాలు ఉండి మూలికలతో వైద్యం ఎలా చేయాలో నేర్చుకున్నారు. అలా చిన్నగా ఆయుర్వేదానికి సంబంధించిన వైద్యం చేయటం ప్రారంభించారు. ఆ తర్వాత ఛింద్వాడాలోని కోయలాంచల్లో నలుగు చోట్ల తన క్లినిక్లను ప్రారంభించి ఆయుర్వేదం వైద్యం చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత డాక్టర్ ప్రకాశ్ విదేశాలకు వెళ్లి అక్కడ కూడా చికిత్స అందించారని ప్రకాశ్ తెలిపారు.
'ఇప్పటి వరకు దాదాపు 112 దేశాల ప్రజలకు చికిత్స అందించాను. జులైలో అమెరికా వెళ్లి మరికొంతమంది వైద్యం చేయనున్నాను. ఇండియాలో అమితాబ్ బచ్చన్, రాజకీయ నాయకులు, అనేక దేశాల వ్యాపారవేత్తలకు నేను వైద్యం చేశాను. అలాగే శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య కాలు సమస్యలతో బాధపడుతున్నప్పుడు చాలా మంది వైద్యులు చికిత్స చేసిన నయం కాలేదు. జయసూర్యకు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ నా గురించి తెలియజేయగా, వైద్యం చేయించుకున్నారు. ఆ తర్వాత కోలుకున్నారు.'