తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెల రోజుల్లో అయోధ్య రామయ్యకు రూ.25కోట్ల విరాళాలు- 60లక్షల మంది దర్శనం

Ayodhya Ram Mandir Donation : అయోధ్యలో కొలువుదీరిన రామయ్యకు భక్తులు నెల రోజుల వ్యవధిలో రూ.25 కోట్ల మేర విరాళాలు సమర్పించుకున్నారు. విరాళాల్లో 25కిలోల బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. జనవరి 23 నుంచి దాదాపు 60లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్లు తెలిపింది.

Ayodhya Ram Mandir Donation
Ayodhya Ram Mandir Donation

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 10:51 PM IST

Updated : Feb 25, 2024, 8:15 AM IST

Ayodhya Ram Mandir Donation : అయోధ్య రామమందిరానికి నెల రోజుల వ్యవధిలో రూ.25 కోట్ల మేర విరాళాలు అందినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రకటించింది. ఇందులో 25 కిలోల బంగారు, వెండి ఆభరణాలూ ఉన్నట్లు వెల్లడించింది. జనవరి 23 నుంచి దాదాపు 60 లక్షల మంది భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నట్లు ట్రస్టు ప్రతినిధి ప్రకాశ్‌ గుప్తా శనివారం చెప్పారు. విరాళాల విషయంలో ట్రస్టు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఆన్‌లైన్ లావాదేవీల లెక్కలు తేలాల్సి ఉందన్నారు.

"ఆలయంలో వినియోగించలేని వెండి, బంగారపు వస్తువులను భక్తులు కానుకగా ఇస్తున్నారు. అయితే, బాల రాముడిపై వారి భక్తిని దృష్టిలో ఉంచుకుని స్వీకరిస్తున్నాం. రామ నవమి రోజుల్లో విరాళాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నాం. సుమారు 50 లక్షల మంది దర్శనానికి విచ్చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. ఆ సమయంలో విరాళాల స్వీకరణకు ఇబ్బందులు తలెత్తకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం. రసీదుల జారీకి 10కి పైగా కంప్యూటర్‌ కౌంటర్లు, అదనపు హుండీలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో కూడిన విరాళాల లెక్కింపు గదిని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం"
-- ప్రకాశ్‌ గుప్తా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు

భక్తులు కానుకగా ఇచ్చే బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువుల మదింపు, వాటిని కరిగించడం, నిర్వహణను భారత ప్రభుత్వ టంకశాలకు అప్పగించినట్లు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. అదేవిధంగా విరాళాలు, చెక్కులు, డ్రాఫ్ట్‌లు, నగదు సేకరణ, వాటిని బ్యాంకులో జమ చేయడం వంటి బాధ్యతలను ఎస్​బీఐకు అప్పగించినట్లు ఈ మేరకు బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

దొంగల ముఠా అరెస్ట్
ఒకవైపు అయోధ్య రామాలయానికి భారీగా భక్తులు పోటెత్తుతుండగా, మరోవైపు చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రామాలయం సహా ఆలయ పరిసరాల్లో చైన్ స్నాచింగ్​లకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగల ముఠాకు చెందిన 16మందిని అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.21 లక్షల విలువైన 11 బంగారు గొలుసులు, రెండు ఎస్‌యూవీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అయోధ్య, వారణాసి, మధుర వంటి మతపరమైన ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితులు బిహార్​కు చెందినవారని చెప్పారు.

30రోజుల్లో 60లక్షల మందికి రామయ్య దర్శనం- కళకళలాడుతున్న అయోధ్య వీధులు

'ఐదేళ్ల బాలరాముడు ఒత్తిడి తట్టుకోలేరు- అందుకే దర్శనానికి రోజూ గంట బ్రేక్'

Last Updated : Feb 25, 2024, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details