Arvind Kejriwal ED Case : మద్యం కుంభకోణం కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు రూ.15,000 బాండ్, రూ. లక్ష పూచీకత్తుతో శనివారం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి క్రేజీవాల్ వెళ్లిపోయారు.
దిల్లీ మద్యం కేసులో విచారణకు సహకరించడంలేదని ఈడీ చేసిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్‌కు ఇప్పటికే రెండుసార్లు కోర్టు సమన్లు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో ఈ ఉదయం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్‌పై మోపిన అభియోగాలు బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను కేజ్రీవాల్‌కు అందజేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. ఈడీ చేసిన అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
8 సార్లు ఈడీ సమాన్లు జారీ
మద్యం కుంభకోణం కేసులో విచారణకు హజరు కావాలని కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు 8 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రతిసారి కేజ్రీవాల్ గైర్హాజరవుతున్నారని గత నెల ఈడీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా హాజరయ్యారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.