తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CAAను ఎప్పటికీ వెనక్కి తీసుకోం- ఆ విషయంలో ప్రతిపక్షాలవన్నీ అబద్ధాలే : అమిత్ షా - amit shah on caa

Amit Shah On CAA Implementation : సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సీఏఏను ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. సీఏఏ విషయంలో ప్రతిపక్షాలన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

Amit Shah On Caa Implementation
Amit Shah On Caa Implementation

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 10:46 AM IST

Updated : Mar 14, 2024, 2:28 PM IST

Amit Shah On CAA Implementation :పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA) వెనక్కి తీసుకునే ప్రసక్తిలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఈ విషయంలో రాజీపడబోమని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. సీఏఏను ముస్లిం వ్యతిరేక చట్టంగా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొందరిని వేరుగా ఉంచడం ఈ చట్టం ఉద్దేశం కాదన్నారు. 1947లో మతం ఆధారంగానే దేశ విభజన జరిగిందన్న అమిత్ షా, వలస వెళ్లినవారు ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. అయితే బుజ్జగింపు రాజకీయాల కారణంగానే నాడు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవడంలేదన్నారు.

'మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదు'
సీఏఏ విషయంలో మైనార్టీలు భయపడాల్సిన పనిలేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఎవరి పౌరసత్వం రద్దుచేసే నిబంధన సీఏఏలో లేదన్నారు. అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ నుంచి వచ్చే హిందూ, బౌద్ద, జైన, సిక్కు, క్రిస్టియన్‌, పార్సీ శరణార్థులకు పౌరసత్వం, హక్కులను మాత్రమే సీఏఏ కల్పిస్తుందని చెప్పారు. AIMIM ఎంపీ ఓవైసీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌, బంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా విపక్షాలన్నీ సీఏఏ విషయంలో అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

'గత 4ఏళ్లలో 41సార్లు చెప్పా'
ఎన్నికల ముందే సీఏఏను ఎందుకు అమలు చేస్తున్నారన్న విమర్శలను అమిత్​ షా కొట్టిపారేశారు. 2019 లోక్​సభ ఎన్నికల మేనిఫేస్టోలోనే సీఏఏను అమలు చేస్తామని బీజేపీ చెప్పిందని గుర్తుచేశారు. పార్లమెంటులో ఆమోదం పొందినప్పటికీ కొవిడ్‌ కారణంగానే సీఏఏ అమలు ఆలస్యమైనట్లు వివరించారు. గత నాలుగేళ్లలో 41 సార్లు ఎన్నికల కంటే ముందే సీఏఏను అమలు చేస్తామని తాను చెప్పినట్లు అమిత్ షా వెల్లడించారు.

'విభజన రోజులను ఆయన మర్చిపోయారు'
సీఏఏపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి దుయ్యబట్టారు. 'అవినీతి బయటపడిన తర్వాత ఆయన సహనం కోల్పోయారు. వలసలపై అంత ఆందోళన ఉంటే బంగ్లాదేశీ చొరబాట్లు, రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడలేదు? విభజన రోజులను ఆయన మర్చిపోయినట్లున్నారు' అని అమిత్ షా ఎద్దేవా చేశారు. బంగాల్‌లో త్వరలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామని తెలిపారు.

'CAAను చూసి భారతీయ ముస్లింలు భయపడొద్దు- హిందువులతో సమానంగా వారికి హక్కులు'

CAA కొత్త పోర్టల్ ప్రారంభం- త్వరలో మొబైల్​ యాప్​ కూడా- కావాల్సిన పత్రాలివే!

Last Updated : Mar 14, 2024, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details