గుట్కా ఉమ్మివేస్తూ పట్టాలపై పడ్డ వ్యక్తి.. దూసుకెళ్లిన రైలు.. కానీ! - ఫరీదాబాద్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
హరియాణాలోని ఫరీదాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్, ఛత్తర్పుర్ జిల్లా నిబారి గ్రామానికి చెందిన ధనిరామ్.. తన కుటుంబంతో కలిసి ఫరీదాబాద్ స్టేషన్లో గీత్ జయంత్రి ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే గుట్కాను ఉమ్మివేసేందుకు వెళ్లి కాలు జారి పట్టాలపై పడిపోయాడు ధనిరామ్. అదే సమయంలో గూడ్స్ రైలు అతడిపైనుంచి వెళ్లిపోయింది. అయితే అదృష్టవశాత్తు అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. పట్టాలపై లేవకుండా అలాగే పడుకోవటం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాడు ధనిరామ్. ఈ ఘటనను స్థానికులు వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST