యాదాద్రి పుణ్యక్షేత్రం... ఆధ్యాత్మిక కళాఖండాలకు నిలయం - యాదాద్రి ఆలయ అందాలు
🎬 Watch Now: Feature Video
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పునర్నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి కృష్ణశిలా విగ్రహాలతో అపురూపంగా రూపొందుతోంది. వివిధ విగ్రహాలతో కూడిన అష్టభుజ మండప ప్రాకారాలు, కాకతీయ స్థూపాలతో పంచ నరసింహుల సన్నిధి ఆవిష్కృతమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో శ్రీక్షేత్రంలోని స్వామివారి ఆలయాన్ని విస్తరించి మాడ వీధులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రధానాలయంలో ప్రాకార మండపాలు, మాడవీధులు, క్యూలైన్ల ఏర్పాటు, ఆళ్వారుల విగ్రహాలు, నారసింహుని వివిధ రూపాల ఉప ఆలయాలు, విద్యుత్ దీపాల అలంకరణ, గర్భాలయ ప్రవేశ ద్వారంపై ప్రహ్లాద చరిత్ర లాంటి కళాఖండాలతో ప్రత్యేక శోభను సంతరించుకుంటోంది.