హైదరాబాద్‌లో తమిళ హీరో విజయ్.. కేసీఆర్‌తో భేటీ - కేసీఆర్‌ను కలిసిన తమిళ హీరో విజయ్
🎬 Watch Now: Feature Video
తమిళ సినీహీరో విజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌కు వచ్చిన విజయ్‌ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పోచంపల్లి శాలువాతో సత్కరించి వెండి వీణను బహుకరించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయాలు, యువత, తాజా, భవిష్యత్ పరిణామాలు తదితరాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. విజయ్‌తో పాటు తన 66వ సినిమా డైరెక్టర్ వంశీపైడిపల్లి కూడా ప్రగతిభవన్‌కు వచ్చారు.