ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. స్వామి వారి పాదాలను తాకిన సూర్యకిరణాలు..! - జైనథ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సూర్య కిరణాలు నేరుగా స్వామి వారి పాదాలకు తాకే అద్భుత దృశ్యాలు భక్తులను కనువిందు చేశాయి. లేలేత సూర్యకాంతులతో సువర్ణ శోభితంగా స్వామివారి విగ్రహం వెలుగులీనింది. అక్టోబర్ మాసంలో ఏటా సూర్య కిరణాలు స్వామివారి పాదాల నుంచి తలపై వరకు వెళ్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జైనుల కాలంనాటి ఈ అద్భుత దృశ్యం అక్కడి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రాత కాలం వేళ ఈ ఆలయం భక్తుల శ్రీమన్నారాయణ నామస్మరణతో కిటకిటలాడింది.