భక్తులపై ఎస్పీ నేత దాడి.. యువకులను దారుణంగా కొట్టి.. - ఉత్తర్ప్రదేశ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
SP Leader Attacked Youth: ఉత్తరప్రదేశ్ బరేలీలోని సాయిబాబా మందిరంలో ప్రార్థనలు చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులపై సమాజ్‌వాది పార్టీ నాయకుడు తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యయి. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని... సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసుుల తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి.. ఎస్పీకి చెందిన లోహియా వాహిని జాతీయ కార్యదర్శి సమర్థ్ మిశ్రగా గుర్తించారు పోలీసులు. పవిత్ర ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్న ఆలయ పూజారి.... దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.