మంచు బిందువులే ముత్యాలుగా మారిన వేళ - మంచు దుప్పటి కప్పుకున్న పల్లెలు
🎬 Watch Now: Feature Video
పల్లెలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. పంట పొలాలు ఆ మంచు అందాలతో మమేకమై సహజ సౌందర్యాన్ని కళ్లకు కడుతున్నాయి. హిమ బిందువులు ముత్యాలుగా మారి పచ్చని పైరును హత్తుకున్నాయి. సాలీడు ఎంతో అందంగా అలుముకున్న గూడును చేరిన మంచు బిందువులు.. ఓ చక్కని దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించాయి. ఇంతటి అద్భుత సోయగాలు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, దివి సీమలో ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.