Pratidhwani: నీరుగారుతోన్న మధ్యాహ్న భోజన పథకం... - Pratidhwani debate news
🎬 Watch Now: Feature Video
బడి ఈడు పిల్లలకు పౌష్టికాహారం అందించే సదుద్దేశంతో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నీరుగారుతోంది. పిల్లలకు బడిపై ఆసక్తి పెంచడం, ఆకలి సమస్యను అధిగమించడం కోసం సాగుతున్న ఈ కార్యక్రమానికి నిధుల కొరత, సౌకర్యాల లేమి ఆటంకాలు సృష్టిస్తున్నాయి. బడుల్లో ఆహారం వండి, వడ్డిస్తున్న కార్మికులకు సకాలంలో బిల్లులు అందడం లేదు. దీంతో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వంట సరుకులు సమకూర్చుకోవడం కష్టంగా మారుతోంది. ఫలితంగా పిల్లల చదువులు, ఆరోగ్యం ఆపదలో పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన పథకం ముందుకు సాగేదెలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.