ప్రతిధ్వని: బ్యాంకుల ప్రైవేటీకరణతో ప్రభుత్వం ఆశిస్తున్నదేంటి...? - ఈటీవీ ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే విలీన ప్రక్రియ ద్వారా బ్యాంకుల సంఖ్యను కుదించిన కేంద్రం.. మరో మూడు బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ప్రైవేటీకరణ విధానమని కేంద్రం చెబుతుంటే.. రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రైవేటీకరణతో నష్టమంటూ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అసలు బ్యాంకుల ప్రైవేటీకరణతో ప్రభుత్వం ఆశిస్తున్నదేంటి...? ఉద్యోగుల భయాలకు పరిష్కారం ఏంటనే విషయంపై ప్రతిధ్వని చర్చ.