ప్రతిధ్వని: అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యంపై దాడి
🎬 Watch Now: Feature Video
అగ్రరాజ్యం అమెరికాలో ఊహించని రీతిలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది. కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ధ్రువీకరణ ప్రక్రియను అడ్డుకొనేందుకు.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ బిల్డింగ్పై దాడిచేసి విధ్వంసాన్ని సృష్టించారు. గోడలు ఎక్కి కిటికీ అద్దాలు పగులగొట్టి.. దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యంలోని ప్రజాస్వామ్యవాదులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాడికి నిరసనగా పలువురు ప్రముఖులు రాజీనామాలు చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ జో బైడెన్.. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో నిలువుటద్దంలా చెప్పుకునే అగ్రరాజ్యంలో ఇలాంటి దాడి జరగడంపై ప్రతిధ్వని చర్చ.