'20 ఏళ్లలో ప్రధాని'.. స్టేట్మెంట్పై కేటీఆర్ ఆసక్తికర కామెంట్.. - ts news
🎬 Watch Now: Feature Video
KTR Special Interview: రాబోయే ఇరవయ్యేళ్లలో మంత్రి కేటీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇటీవల అమెరికాలోని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను మంత్రి అవుతాననే జీవితంలో అనుకోలేదని ఆయన అన్నారు. ఏదో అలా కలిసి వచ్చిందని చెప్పారు. ఉద్యమంలో పాల్గొన్న అనంతరం రాష్ట్రం వచ్చిందని.. అనంతరం సిరిసిల్ల ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మంత్రిని అయ్యానని వెల్లడించారు. భవిష్యత్లో ఏం జరుగుతుందనే విషయంలో తనకు ఎలాంటి ఆతృత, ఎజెండా కానీ లేదన్నారు. ప్రస్తుతం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో తెలంగాణలో ఓ పనిలో నిమగ్నమయ్యామన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే కచ్చితంగా మళ్లీ తెలంగాణకే సేవ చేయాలని ఉందని... ప్రధాని కావాలనే పెద్ద పెద్ద కోరికలు లేవన్నారు.