ఉస్మానియాలో అరుదైన సన్నివేశం.. హరీశ్​ రావు, రాజాసింగ్​ కలిసి లంచ్​..

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 12, 2022, 4:59 PM IST

ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు ఎక్కుపెట్టే నేతలు కలిసి భోజనం చేశారు. హైదరాబాద్​లోని ఉస్మానియా ఆసుపత్రిలో ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. రోగి సహాయకులకు మూడు పూటలా 5రూపాయలకే భోజన వసతి కార్యక్రమాన్ని మంత్రి హరీశ్​ రావు ఉస్మానియా ఆసుపత్రిలో ప్రారంభించారు.ఈ సందర్భంగా రోగి సహాయకులకు స్వయంగా భోజనం వడ్డించిన మంత్రి.. తాను కూడా 5 రూపాయల భోజనాన్ని మంత్రి మహమూద్​ అలీ, గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​తో కలిసి తిన్నారు. భోజనం చేసేటప్పుడు ఎలా ఉందంటూ పలువురు మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకు ముందు భోజనం కోసం చాలా కష్టపడాల్సి వచ్చేదని మహిళలు మంత్రికి చెప్పారు. ఈ కార్యక్రమం తమ ఆకలి తీరుస్తుందని వారు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.