ప్రతిధ్వని: స్టాక్ మార్కెట్లపై అమెరికా ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపుతాయి..! - అమెరికా ఎన్నికలపై ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. అగ్రరాజ్యంపైనే కాదు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నింటిపైనా ఈ ఎన్నికల ప్రభావం పడుతుంది. కొత్త అధ్యక్షుడి విధానాలు ఎలా ఉంటాయన్న దానిపైనా స్టాక్ మార్కెట్ల సూచీలు ఆధారపడి ఉంటాయి. అమెరికా ఎన్నికల కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మన స్టాక్ మార్కెట్లూ అదే ఒరవడిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి?.. ట్రంప్- బైడెన్లలో ఎవరు అధ్యక్షుడు అయితే స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి?.. ముఖ్యంగా మన దేశానికి ఏ విధంగా మేలు జరుగుతుంది? వంటి అంశాలపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ.