గణపతి మండపంలో చోరీ.. ఎలా దొంగిలించాడో చూడండి.. - గణపతి మండపంలో చోరీ
🎬 Watch Now: Feature Video
సిద్ధిపేట జిల్లా కోహెడలో వినాయకుడి మెడలో డబ్బుల దండ అపహరణకు గురైంది. నవరాత్రులలో భాగంగా పోచమ్మ గుడి ఆవరణలో ఏర్పాటు చేసిన గణపతికి మెుదటిరోజు భక్తులు కరెన్సీ దండ వేసి తమ భక్తిని చాటుకున్నారు. రాత్రి పూజల తరువాత అందరూ వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూడగా ఆ దండ మాయమైంది. నిర్వాహకులు సీసీ కెమెరాని పరిశీలించగా, గుర్తుతెలియని యువకుడు గణపతి మెడలో నుంచి డబ్బుల దండ దొంగిలించిన చిత్రాలు నమోదయ్యాయి. యువకుడు సమీప గ్రామమైన వింజపల్లి వాసిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.