ప్రతిధ్వని: ట్రంప్ నిర్ణయంతో భారత ఐటీ రంగం భవితవ్యమేంటి? - ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video

ఉద్యోగ వీసాలను ఈ డిసెంబరు వరకు జారీ చేయకూడదని అమెరికా కఠిన నిర్ణయం తీసుకుంది. హెచ్1బి వీసాలను డిసెంబరు వరకు రద్దు చేసింది. అలాగే హెచ్2, హెచ్4, ఎల్1, జే1 వీసాలపై కూడా దీని ప్రభావం ఉండనుంది. ఆర్థిక మాంధ్యంతో ఉద్యోగాలు కోల్పోయిన స్థానిక అమెరికన్ల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డొ ట్రంప్ సమర్థించుకుంటున్నారు. ఇకమీదట ఎక్కువ జీతం పొందే వారినే అమెరికాకు అనుమతిస్తామని ఆయన అన్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై ఐటీ రంగం నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా తాజా నిర్ణయం తమకెంతో అసంతృప్తికి గురిచేసిందని గూగుల్ సీఈవో సుందర్ పీచాయ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం భారతీయ ఐటీ రంగాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు? మన దేశానికి ఎంత నష్టం వాటిల్లనుంది? ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఏమిటి? అనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Jun 26, 2020, 5:28 PM IST