PRATHIDWANI: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఏంటి? - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు భారీగా పెంచేందుకు యాజమాన్యాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఇరవై నుంచి యాభై శాతం మేరకు ఫీజులు పెంచేసినట్లు తల్లిదండ్రుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాధారణ ట్యూషన్ ఫీజులకు తోడు పుస్తకాలు, దుస్తులు, రవాణా ఖర్చుల పేరుతో అదనంగా భారం మోపుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపుదలపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి? ఫీజుల నిర్ణయంలో ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయా? ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్న యాజమాన్యాలను కట్టడి చేయడం ఎలా? అనే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని.