ప్రతిధ్వని: ఆర్బీఐ చేయూతతో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ గాడిన పడేనా? - co-operative banking system in India
🎬 Watch Now: Feature Video
దేశంలోని సహకార బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పెంచి మరింత భద్రత కల్పించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,482 పట్టణ, 58 బహుళరాష్ట్రాల సహకార బ్యాంకులను ఆర్బీఐ పరిధిలోకి తెచ్చే నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో 8.6 కోట్ల ఖాతాదారులు చేసిన ఐదు లక్షల కోట్ల డిపాజిట్లకు భద్రత చేకూరుతుంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ కుంబకోణం జరగటంతో.... సహకార వ్యవస్థ విశ్వసనీయతమీదే సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాంటి సందేహాలకు, ఆందోళనలకు తావు లేకుండా సహకార బ్యాంకుల్ని గాడిన పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో... ఆర్బీఐ చర్యలతో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఏ మేరకు బలోపేతం అవుతుందనే అశంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ...
Last Updated : Jun 26, 2020, 5:17 PM IST