ప్రభుత్వ బడుల్లో టీచర్లు, పుస్తకాల కొరత.. ఈ పరిస్థితుల్లో చదువులు సాగేదెట్లా?
🎬 Watch Now: Feature Video
PRATHIDHWANI: రాష్ట్రంలో విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలంటూ గొప్పలు చెప్పినా అందుకు అనుగుణంగా సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. టీచర్ల కొరతతోపాటు, పుస్తకాలు-యూనిఫాంలు సమయానికి అందించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో ఎలా పోటీ పడతారనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. స్కూళ్లు మొదలై నెల రోజులు దాటినా సమస్యలు తీరకపోవడానికి కారణమేంటి..? ప్రభుత్వ బడులు బాగుపడాలంటే ఏం చేయాలనే అంశాలపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని .