పోలీసులు గ్యాంగ్‌స్టర్ మధ్య ఎన్కౌంటర్ లైవ్ వీడియో - బబ్లు గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్ వీడియో
🎬 Watch Now: Feature Video
పంజాబ్‌లో బటాలా ప్రాంత పోలీసులుకు ఓ గ్యాంగ్‌స్టర్‌కు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించిన పోలుసులు బబ్లు అనే గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకున్నారు. గురుదాస్‌పుర్‌లోని బటాలా సమీపంలో ఉన్న కోట్లా బోజా అనే గ్రామంలోని పొలాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసు వాహనాల హారన్ విని భయపడ్డ బబ్లు తన కారుని పొలాల్లోని పోనిచ్చి పోలీసులపై కాల్పులు జరిపాడు. దాదాపు నాలుగు గంటల పాటు బటాలా పోలీసులకు, బబ్లుకు కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో గాయపడ్డ బబ్లు చివరికి పోలీసులకు చిక్కాడు.
Last Updated : Oct 15, 2022, 5:22 PM IST